Advertisementt

ఆ సినిమాకి సీక్వెల్ సెట్ అవుతుందా...?

Sun 26th Apr 2020 11:59 AM
rx 100,ajay bhupathi,karthikeya,payal rajput  ఆ సినిమాకి సీక్వెల్ సెట్ అవుతుందా...?
Will that sequel workout... ఆ సినిమాకి సీక్వెల్ సెట్ అవుతుందా...?
Advertisement
Ads by CJ

చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన చిత్రం ఆర్ ఎక్స్ 100. ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంటెంట్ సరిగ్గా ఉంటే చిన్న సినిమా అయినా ఎలాంటి విజయం సాధిస్తుందో చెప్పిన చిత్రమిది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయ హీరోగా నటించగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతో హీరో హీరోయిన్లకి మంచి గుర్తింపు వచ్చింది.

ఆర్ ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం అనే సినిమా చేస్తున్నాడు. ఎందరో హీరోల నుండి ఈ స్క్రిప్టు చివరికి శర్వానంద వద్దకి చేరింది. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అవ్వగానే ఈ చిత్రం మొదలవనుందట. అయితే ఇదిలా ఉంటే అజయ్ భూపతి మూడవ చిత్రం గురించి చర్చ జరుగుతుంది. మహాసముద్రం తర్వాత అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.

ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సీక్వెల్ వర్కౌట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ ఎక్స్ 100 లో హీరో చనిపోతాడు. అదీగాక ఈ సినిమాని నిజ జీవిత పాత్ర ద్వారా స్ఫూర్తి పొంది చేశాడు. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ ఎలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంపై అజయ్ భూపతి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Will that sequel workout...:

Ajay Bhupathi wants to do a sequel for his Debut film RX 100

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ