Advertisementt

సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ సాయం

Mon 27th Apr 2020 08:42 AM
raghava lawrence,chennai,hyderabad,dancers,help  సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ సాయం
Raghava Lawrence Generous Help Of 5,75,000 To Film Dancers సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ సాయం
Advertisement
Ads by CJ

సినీ నృత్య కళాకారులకు రాఘవ లారెన్స్ 5,75,000 ఆర్థిక సహాయం

పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నై లో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. 

ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘‘డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యతగా భావించి వారి అకౌంట్లకు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగింది’’ అన్నారు. తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు.

Raghava Lawrence Generous Help Of 5,75,000 To Film Dancers:

Raghava Lawrence helps Hyd and Chennai Dancers 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ