Advertisementt

ఆర్ ఎక్స్ పాపకి అర్జున్ రెడ్డి కావాలంట..

Sun 26th Apr 2020 11:40 AM
payal rajput,lockdown celebroties,arjun reddy,vijay devarakonda  ఆర్ ఎక్స్ పాపకి అర్జున్ రెడ్డి కావాలంట..
RX beauty wants Arjun Reddy.. ఆర్ ఎక్స్ పాపకి అర్జున్ రెడ్డి కావాలంట..
Advertisement
Ads by CJ

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్, ఆ ఒక్క సినిమాతో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందం, అభినయం రెండింటి కలయికతో కుర్రకారు మతిని పోగొట్టింది. అయితే ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని భావించారు. కానీ అలా జరగలేదు. అయితే దానికి ఆమె ఎంచుకున్న ఆర్డీఎక్స్ సినిమా కూడా ఓ కారణమే. 

మొదటి సినిమాలో బోల్డ్ గా కనిపించడానికి కథ పరంగా కారణం ఉంది. కానీ రెండవ సినిమా ఆర్డీఎక్స్ లో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. అందుకే ప్రేక్షకులు సహించలేకపోయారు. దాంతో ఆ సినిమా డిజాస్టర్ అవడంతో పాటు ఆమెకి అవకాశాలని రానివ్వకుండా చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పాయల్, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది.

మొన్నటికి మొన్న పిల్లో ఛాలెంజితో కేక పుట్టించిన పాయల్, అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చింది. అయితే అందులో భాగంగా ఓ నెటిజన్, ఇప్పటికిప్పుడు మీరు ఎవరితో నటించాలని అనుకుంటున్నారని అడగ్గా, పాయల్ తడుముకోకుండా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ పేరుని చెప్పింది. పాయల్ అలా చెప్పడంతో  విజయ్ పక్కన పాయల్ బాగానే సెట్ అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి భవిష్యత్తులో పాయల్ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

RX beauty wants Arjun Reddy..:

Rx beauty wants Aarjun Reddy hero Vijay Devarakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ