Advertisementt

ఎన్టీఆర్ ఛాలెంజ్‌.. బాలయ్యలో నో స్పందన.. కారణం?

Sun 26th Apr 2020 07:03 PM
balakrishna,jr ntr,be the real man,challenge,nandamuri family  ఎన్టీఆర్ ఛాలెంజ్‌.. బాలయ్యలో నో స్పందన.. కారణం?
Balayya not Reacted on Jr NTR be the Real Man Challenge ఎన్టీఆర్ ఛాలెంజ్‌.. బాలయ్యలో నో స్పందన.. కారణం?
Advertisement
Ads by CJ

లాక్‌డౌన్ సమయంలో సామాన్యుల నుంచి  ప్రముఖ సెలబ్రిటీల వరకూ అంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఇంటిని శుభ్రం చేసే పనిలో ప్రముఖ హీరోలంతా బిజీ అయిపోవడంతో కాకుండా మరొకరికి ఛాలెంజ్ కూడా విసురుతున్నారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ల పర్వం నెట్టింట్లో ఓ పెద్ద హాట్ టాపిక్. ఆసక్తికరంగా చూసేసి వదిలేసిది ఓ వర్గమైతే.. పూట గడవని నిరుపేదలకు నిత్యావసరాలు అందించే ఛాలెంజ్‌లు విసురుకోండి.. మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకుంటూ ఛాలెంజ్‌లేంటంటూ మరో వర్గం మండిపడుతోంది. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. దీన్నిలా వదిలేస్తే.. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఛాలెంజ్ ‘బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్’.

 

ఇప్పటికే దీనిని మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ తదితరులు పూర్తి చేసేశారు. అయితే ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన అనంతరం ఎన్టీఆర్ తన బాబాయి నందమూరి బాలకృష్ణ, నాగార్జునను నామినేట్ చేశారు. అయితే దీనికి బాలయ్య ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. బాలయ్య చీపురు పట్టి ఊడ్చటం లాంటి పనులేమీ చేయరు కాబట్టి ఈ ఛాలెంజ్‌కి స్పందించలేదని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఎన్టీఆర్, బాలయ్యల మధ్య మనస్పర్థలు ఇంకా సమసిపోలేదు. నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయి... అందుకే బాలయ్య స్పందించడం లేదంటూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే నాగ్ కూడా ఎన్టీఆర్‌కు ఛాలెంజ్‌కు స్పందించలేదు. ఈ విషయాన్ని అసలు పరిగణలోకే తీసుకోని నెటిజన్లు.. బాలయ్య విషయంలో మాత్రం ఊహలకు పదును పెట్టడం విశేషం.

Balayya not Reacted on Jr NTR be the Real Man Challenge:

Balakrishna not reacted on Jr NTR Challenge 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ