సాధారణ తెలుగు లెక్చరర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి.. అనతి కాలంలో ప్రముఖ కమెడియన్‌గా ఎదిగారు బ్రహ్మానందం. కొన్ని నెలల క్రితం వరకూ బ్రహ్మి లేని సినిమాలను ఊహించలేం. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. అయితే దేశానికి ఎలాంటి విపత్తు ఎదురయినా.. సాయం అందించడంలో సెలబ్రిటీలు ముందుంటారు. అయితే బ్రహ్మి మాత్రం ఎంగిలి చేత్తో కాకిని తోలరనేది టాలీవుడ్ టాక్. దీనికి తగ్గట్టే ఆయనెప్పుడూ ఎవరికీ సాయం చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఒక్కసారిగా ఆయన ఇటీవల సీసీసీ కోసం రూ.3 లక్షలు విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కాగా.. ఆయన దాన ధర్మాల గరించి వేదాంత ధోరణిలో మాట్లాడటం విస్మయానికి గురి చేస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో వేదాంత ధోరణి పెరగడం కామనే కానీ అది ఓ కౌంటర్‌ల ఉండటంతో.. ఎవరికిచ్చారా? అని ఫిలింనగర్‌లో అంతా చర్చించుకుంటున్నారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాన ధర్మాల టాపిక్ వచ్చినపుడు బ్రహ్మి మాట్లాడుతూ... ‘‘ఈ గ్లోబు అందరిదీ. అందరికీ సమాన హక్కులున్నాయి. దేవుడు ఇచ్చిందే ఇంకొకడికి ఇస్తున్నాం. అందులో గొప్పదనం ఏమీ లేదు. దానం చేస్తే ఆ సంగతి ఎవరికీ తెలీయకూడదు, పబ్లిసిటీలెందుకు? ఇప్పటి వరకూ నేను 23 మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ఇలాంటి విషయాలు నేనెప్పుడూ చెప్పుకోను’’ అని బ్రహ్మీ వెల్లడించారు.