Advertisementt

‘ఆచార్య’లో ‘విక్రమార్కుడు’ విలన్ కీలక పాత్ర!

Sun 26th Apr 2020 12:09 PM
ajay,acharya movie,mega star chiranjeevi,koratala siva,acharya  ‘ఆచార్య’లో ‘విక్రమార్కుడు’ విలన్ కీలక పాత్ర!
Actor Ajay Talks about His role in Acharya Movie ‘ఆచార్య’లో ‘విక్రమార్కుడు’ విలన్ కీలక పాత్ర!
Advertisement
Ads by CJ

‘విక్రమార్కుడు’లో టిట్లాగా తన విలనిజంతో మాస్ ఆడియన్స్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నటుడు అజయ్. ఆ తరువాత వరుస చిత్రాలతో బ్రేక్ లేకుండా నేటికీ ఏదో ఒక చిత్రంలో మంచి ప్రాముఖ్యమున్న పాత్రలో కనిపిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అజయ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో తనకు ప్రాముఖ్యమున్న పాత్ర లభించిందని ఓ ఇంటర్వ్యూలో అజయ్ వెల్లడించాడు.

మెగాస్టార్ చిత్రమంటే.. మాటలా? ఇంకేముంది ఈ చిత్రంలో అజయ్ పాత్ర ఎలా ఉండబోతోంది? విలన్‌గా నటిస్తున్నాడా? లేదంటే మరేదైనా క్యారెక్టరా? అంటూ రకరకాల ఊహాగానాలు అప్పుడే మొదలై పోయాయి.

కెరీర్‌లో అపజయమెరుగని దర్శకుడు కొరటాల.. అభిమానుల అండ మెండుగా ఉన్న హీరో చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానులకు పండుగే. ఈ సినిమా నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూనే వస్తోంది. మన హీరోతో పాటు దర్శకుడు సైతం ఈ సినిమా గురించి ఏదో ఒక విషయాన్ని వెల్లడిస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు.

తాజాగా అజయ్ ఇంటర్వ్యూతో ఈ సినిమా గురించి టాక్ పీక్స్‌లోకి వెళ్లింది. అజయ్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు.. చిరు ఆయనను పలకరించిన తీరు.. ఆ సమయంలో తన ఫీలింగ్స్‌ ఆయన మాటల్లోనే...

‘చిరంజీవిగారి చిత్రంలో చేస్తున్నాననే ఫీలింగే చాలా గొప్పగా ఉంది. అలాంటిది ఒక గొప్ప పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ పాత్ర నా కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. శివగారు నా పాత్రను అలా మలిచారు. ఇక ఈ సినిమా నిమిత్తం సెట్లో చిరంజీవిగారిని కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను ఈ ప్రపంచాన్ని మరిచిపోయానంటే నమ్మండి. ఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించిన తీరు, ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి ఆయన నోటి వెంట వింటుంటే.. నిజంగా నేను ఇది కల, నిజమా అనే అనుభూతికి లోనయ్యాను.. ఎంతైనా మెగాస్టార్ మెగాస్టారే..’ అని అజయ్ వివరించాడు.

Actor Ajay Talks about His role in Acharya Movie:

Actor Ajay key role in Acharya Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ