సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉండడంతో అందరూ సోషల్ మీడియా మీదే పడిపోవడంతో ఈ ఛాలెంజిలు మరింతగా ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఛాలెంజిలో బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజి ఒకటి. ఈ ఛాలెంజి ప్రకారం మగవాళ్ళు ఇంటిపనుల్లో కూడా భాగం పంచుకోవాలి. అయితే ఈ ఛాలెంజిని స్వీకరించిన డైరెక్టర్లు, స్టార్ హీరోలు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అదలా ఉంటే ఇప్పుడు తాజాగా హీరోయిన్ల కోసం పిల్లో ఛాలెంజి ట్రెండ్ అవుతుంది. చాలా రోజుల నుండి ఈ పిల్లో ఛాలెంజి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కి చేరింది. ఈ ఛాలెంజి ప్రకారం ఒంటిమీద అఛ్చాదన లేకుండా కేవలం దిండుని కప్పుకుని ఫోటోకి ఫోజు ఇవ్వడమే. మొన్నటికి మొన్న ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ పిల్లో ఛాలెంజిని స్వీకరించి నెటిజన్ల మతిపోగొట్టింది.
తాజాగా ఈ లిస్టులో తమన్నా కూడా చేరింది. పిల్లో ఛాలెంజిని మరింత హాట్ గా మారుస్తూ ఆమె ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలే మిల్కీ బ్యూటీ, ఆపైన తెల్లటి దిండుని కప్పుకుని ఇచ్చిన ఫోజ్ తో అందరి మతి పోతుంది.