కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోయాయి. వైరస్ ప్రభావం తగ్గి, అన్నీ కుదురుకుని పరిస్థితులు చక్కబడాలంటే చాలా టైమ్ పట్టేలా ఉంది. దాంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనబడట్లేదు. ఈ ఉద్దేశ్యంతో చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని డిజిటల్ మీడియం ద్వారా విడుదల చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో జ్యోతిక నటించిన పొన్ మగల్ వందాల్ అనే తమిళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో థియేటర్ల సంఘాలు సూర్యపై పైర్ అయ్యాయి. థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ చేసిన సినిమాలని ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. థియేటర్లు తెరుచుకునే వరకూ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ వారి మాట కాదని రిలీజ్ చేస్తే సూర్య హీరోగా చేసే సినిమాలన్నింటిపై నిషేధం విధిస్తామని హెచ్చరిస్తున్నారట. సూర్య సినిమాలే కాకుండా, నిర్మాతగా వ్యవహరించే సినిమాలు థియేటర్లలో ఆడకుండా చేస్తామని అంటున్నారు. మరి ఈ హెచ్చరికల్ని దాటుకుని సూర్య పొన్ మగాల్ వందాల్ సినిమాని అమెజాన్ లో రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.