ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ, ఇప్పుడు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె చాలా వరకు సినిమాలని తగ్గించింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రత్యేక గీతాల్లో మెరిసిన శ్రియకి అవకాశాలు బాగానే వచ్చాయట. కానీ వచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఒప్పేసుకోవడం కరెక్ట్ కాదని సూచిస్తోంది. చాలా సార్లు డైరెక్టర్లు మనకి చెప్పిన కథ కన్నా డిఫరెంట్ గా తెరకెక్కిస్తుంటారట.
నెరేషన్ ఇచ్చినపుడు ఒకలా చెప్పి,సెట్లోకి వెళ్లగానే పూర్తిగా మార్చేస్తారట. గతంలో ఇలాంటి అనుభవాలు ఆమెకి చాలా ఎదురయ్యాయట. దానివల్ల కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. అందుకే అప్పటి నుండి వచ్చిన ప్రతీ పాత్రని ఒప్పుకోవడం లేదట. పూర్తి స్క్రిప్టు తన వద్దకి తీసుకువస్తేనే నటిస్తానని అంటుంది. పూర్తి స్క్రిప్టు విన్న తర్వాత మార్చడానికి వీలుండదు కనుక అలా చేయడం చాలా ఉత్తమం అని చెబుతుంది. సాధారణంగా చాలా మంది నటీనటులకీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటివల్ల నటీనటుల కెరీర్ కి బాగా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి శ్రియ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అంటున్నారు. అయితే అందరు దర్శకులు అలా ఉండరు కానీ కొందరి వద్దనైనా ఇలా స్ట్రిక్ట్ గా ఉంటే బెటరే కదా..