Advertisementt

ప్రభాస్ 21వ సినిమాకి హీరోయిన్ దొరికేసిందా..?

Sat 25th Apr 2020 11:09 AM
prabhas,pooja hegde,kiara advani,bahubali  ప్రభాస్ 21వ సినిమాకి హీరోయిన్ దొరికేసిందా..?
Prabhas 21st movie got a eroine..? ప్రభాస్ 21వ సినిమాకి హీరోయిన్ దొరికేసిందా..?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతలా మారిందో అందరికీ తెలిసిందే. అయితే అది ప్రాక్టికల్ గా నిరూపితమైంది మాత్రం సాహో సినిమాతోనే. బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విజయవంతం కావడానికి చాలా ఫ్యాక్టర్స్ తోడ్పడ్డాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్నింటిలో ఒక అతిపెద్ద ఫ్యాక్టర్ గా ప్రభాస్ నిలిచాడు. కానీ సాహో సినిమాకి అలా జరగలేదు.  ఆ సినిమా ప్రభాస్ పేరు మీదనే ఆడింది.

దక్షిణాదిన మిశ్రమ స్పందన తెచ్చుకున్న సాహో సినిమాకి బాలీవుడ్ జనాలు నీరాజనాలు పట్టారు. దాంతో బాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమై పోయింది. ప్రస్తుతం ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించేందుకు హీరోయిన్ ని వెతుకుతున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో విజయం అందుకున్న కియారా అద్వానీ ఈ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే ఫోన్ ద్వారా చర్చలు జరిగాయని సమాచారం. కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలో నటించింది. మరి ఈ సినిమాలోనూ అవకాశం దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందేమో చూడాలి.

Prabhas 21st movie got a eroine..?:

nag Ashwin going to direct prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ