Advertisementt

నక్సలైట్ గా కనిపించనున్న నటి..

Fri 24th Apr 2020 04:40 PM
rana,venu oodugula,priyamani  నక్సలైట్ గా కనిపించనున్న నటి..
Heroine doing a naxalite role in.. నక్సలైట్ గా కనిపించనున్న నటి..
Advertisement
Ads by CJ

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండవ చిత్రాన్ని రానా హీరోగా తెరకెక్కిస్తున్నాడు. విరాటపర్వం టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా అని సమాచారం. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నక్సలైట్లు చాలా ఎక్కువగా ఉండేవారు. ఆ నేపథ్యాన్ని తీసుకుని వేణు ఊడుగుల ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

సాయిపల్లవి ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనుందట. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకున్నారని సమాచారం. ఇంతకు ముందు తెలుగు, తమిళంలో సినిమాలు చేసి, నటనలో జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రియమణి విరాటపర్వంలో నటిస్తుందట.  ప్రియమణి కూడా కూడా సాయిపల్లవి లాగే నక్సలైట్ గానే కనిపిస్తుందని అంటున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.

Heroine doing a naxalite role in..:

Priyamani doing a naxalite role in Virataparvam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ