Advertisementt

గెటప్ శీనును అవమానించిన నిర్మాత ఎవరు?

Sun 26th Apr 2020 10:37 AM
getup srinu,producer,insulted,jabardasth,comedian,early stage  గెటప్ శీనును అవమానించిన నిర్మాత ఎవరు?
Getup Srinu insulted by Tollywood Producer గెటప్ శీనును అవమానించిన నిర్మాత ఎవరు?
Advertisement
Ads by CJ

జబర్దస్త్ కి దొరికిన ఆణిముత్యం గెటప్ శీను అనడం ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ లో వేసిన గెటప్ వేయకుండా, చేసిన కామెడి చెయ్యకుండా ఆకట్టుకునే కమెడియన్. అయితే టీం లీడర్ గా సక్సెస్ కాలేని గెటప్ శీను ఇప్పుడు వెండితెర మీద కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే గెటప్ శీను ని అన్నం తినే ముందు ఘోరంగా అవమానించి స్టూడియో నుండి గెంటేసిన సంఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. గెటప్ శీను లాంటి వాడిని గెంటేసిన నిర్మాత ఎవరంటూ ఆరాలు మొదలయ్యాయి.

అయితే గెటప్ శీను ని గెంటేసింది ఇప్పుడు క్రేజ్ వచ్చాక కాదు, శీను సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయ్యి.. నాగోల్ లో మకాం పెట్టి.. జూబ్లీహిల్స్ కి వచ్చి అవకాశాలు వెతుక్కునేవాడట. అయితే శీను అన్నపూర్ణ స్టూడియోస్ లో తెలిసిన వారుంటే... అక్కడ షూటింగ్ జరుగుతుంటే చూడడానికి వెళ్లి షూటింగ్ చూసి భోజనం పెడుతుంటే.. భోజనానికి కూర్చోగా... అక్కడికి అప్పుడే వచ్చిన ఆ సినిమా నిర్మాత గెటప్ శీను ని ఎవడ్రా నువ్వు అని అడగడంతో.. తనకు తెలిసిన వాళ్ల నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పేలోపే.. బండ బూతులు తిట్టి.. తినే కంచాన్ని కూడా లాగేసి తనను అక్కడినుండి మెడబట్టుకు బయటికి గెంటేసారని చెప్పాడు శ్రీను. అయితే ఆ విషయాన్నీ తలుచుకుంటే ఇప్పటికి ఏడుపొస్తుంది అని.. అసలు ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్ళానా అని ఎప్పుడూ బాధపడుతుంటా అని చెబుతున్నాడు.  

Getup Srinu insulted by Tollywood Producer :

Getup Srinu says that a producer insulted him

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ