మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడని కన్ఫర్మేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ లు గురుశిష్యులుగా కనిపించనున్నారట. అయితే ముందుగా రామ్ చరణ్ పాత్రలో మహేష్ నటిస్తున్నాడని వార్తలు వచ్చినప్పటికీ చివరికి రామ్ చరణ్ ని ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కనిపించే అవకాశాలు తగ్గిపోతున్నాయి.
ఆచార్యలో రామ్ చరణ్ ని నటింపజేయడానికి రాజమౌళి నుండి కొరటాల శివ అనుమతి కూడా తెచ్చుకున్నాడు. రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో రామ్ చరణ్ ఆచార్యలో నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు. అయితే సడెన్ గా కరోనా వల్ల పరిస్థితులు తారుమారు కావడంతో అప్పటి వరకు వేసుకున్న ప్లానింగ్ మొత్తం మారిపోయింది.
లాక్డౌన్ వల్ల సినిమా షూటింగులకి ఎప్పుడు అనుమతులు లభిస్తాయో తెలియదు. అదీగాక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కూడా రామ్ చరణ్ టైమ్ కేటాయించాల్సి ఉంది. దాంతో రామ్ చరణ్ ఆచార్యలో నటించే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.