ఆ వార్తలని ఖండించిన బాలీవుడ్ నటుడు..

Bollywood actor condemn those news

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో జనాలందరూ ఇళ్లలో నుండి బయటకి రావడం లేదు. బయటకి వస్తే కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతో అందరూ ప్రభుత్వం ఆదేశాలని సరిగ్గానే పాటిస్తున్నప్పటికీ, కొందరు ఆకతాయిలు లాక్డౌన్ ని ఉల్లంఘిస్తూ ఇళ్ల నుండి బయటకి వస్తున్నారు. దీంతో పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలని పట్టించుకోకుండా బయటకి వస్తున్న వారిని శిక్షిస్తున్నారు.

అయితే తాజాగా లాక్డౌన్ ని ఉల్లంఘించినందుకుగాను బాలీవుడ్ నటుడిని పోలీసులు కొట్టారన్న వార్త వైరల్ అయింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో నటించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు విక్కీ కౌషల్ ని లాక్డౌన్ ని పట్టించుకోకుండా బయటకి వచ్చినందుకు పోలీసులు కొట్టారని అన్నారు. అయితే ఈ విషయమై విక్కీ కౌషల్ క్లారిటీ ఇచ్చాడు.

అసలు నేను బయటకే వెళ్లడం లేదు. అయినా ఆ వార్తలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. లాక్డౌన్ పెట్టినప్పటి నుండి నేను ఇంట్లోనే ఉంటున్నాను. నన్ను పోలీసులు కొట్టారన్నది అవాస్తవం. అనవసరంగా ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల ఎవరికి లాభమో తెలియట్లేదు. కరోనా టైమ్ లో ఎంతగానో శ్రమిస్తున్న పోలీసులకి, వైద్యులకి కృతజ్ఞతలు తెలియజేశాడు విక్కీ. ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు.

bollywood actor condemn those news

bollywood
lockdown celebrities
vicky kaushal
covid19
coronavirus