మెగా బ్రదర్ నాగబాబు కొడుకు కెరీర్ పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన కంచె సినిమాతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. విభిన్నమైన సబ్జెక్టులని ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు.
విభిన్నమైన చిత్రాలని ఎంచుకుంటూ వెళ్తున్న వరుణ్ తేజ్ ని నాగబాబు, తనకి ఇష్టమైన రెండు సినిమాల రీమేక్ లలో నటింపజేయాలని అనుకుంటున్నాడట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమా రీమేక్ లలో వరుణ్ తేజ్ హీరోగా చేస్తే చూడాలని ఉందని కోరుతున్నాడు. ఆ రెండూ నాగబాబుకి చాలా ఇష్టమైన చిత్రాలట. వాటిని ఈ కాలానికి తగినట్టుగా మార్చి వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట.
వరుసగా హిట్లు కొడుతున్న వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. మరి ఈ రెండు సినిమాలని ఇప్పటి కాలానికి తగ్గట్టుగా ఆధునీకరించి పట్టుకెళ్లే దర్శకులెవరో చూడాలి. ఒకవేళ అలాంటి దర్శకుడు వరుణ్ తేజ్ వద్దకి వస్తే తండ్రి కోసం ఆ సినిమాలని రీమేక్ చేస్తాడో లేదో చూడాలి.