Advertisementt

ఆమెని పక్కనపెట్టి అనూని తీసుకున్నారా..?

Thu 23rd Apr 2020 02:17 PM
majnu,nani,anu emmanuel,sukumar,kriti shetty,vaishnav tej,uppena  ఆమెని పక్కనపెట్టి అనూని తీసుకున్నారా..?
Anu immanuel selected for lead role in 18 pages..? ఆమెని పక్కనపెట్టి అనూని తీసుకున్నారా..?
Advertisement
Ads by CJ

నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం అయిన భామ అనూ ఇమాన్యూయేల్ కి తెలుగులో పెద్దగా సక్సెస్ రాలేదు. మజ్ను తర్వాత ఆమె చేసిన సినిమాలేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేవు. పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసిలో నటించినా, ఇటు అల్లు అర్జున్ కి జంటగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో మెరిసినా కూడా ఆమెకి పరాజయమే మిగిలింది. అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో ఆమె కెరీర్ అంత ఆశాజనకంగా సాగడం లేదు.

మొన్నటికి మొన్న విలన్ భార్యగా ఏదో సినిమాలో సెలెక్ట్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమెకి 18 పేజెస్ చిత్రంలో అవకాశం వచ్చిందని అంటున్నారు. సుకుమార్ రాసిన ఈ కథని కుమారి ౨౧ ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ ౨ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ హీరోగా కనిపిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా క్రితిశెట్టిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. క్రితి శెట్టి సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె స్థానంలో అనూ ఇమ్మాన్యుయేల్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ 18 పేజేస్ లో ఉప్పెన హీరోయిన్ ని తీసుకుంటేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. 

Anu immanuel selected for lead role in 18 pages..?:

Anu immanuel selected for Sukumar 18 pages

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ