రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి వస్తున్నన్ని వార్తలు మరే సినిమా గురించి రావట్లేదేమో. లాక్డౌన్ కారణంగా జనాలంతా ఇళ్ళలో ఉన్న ఈ సమయంలో మోషన్ పోస్టర్ తో పాటు, రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసి అందరిలో అంచనాలు పెంచేశాడు. అయితే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లు రిలీజ్ చేసిన దగ్గరి నుండి ప్రతీ ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి. అసలు అల్లూరి సీతారామరాజు పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు.
మనకు తెలిసిన చరిత్ర ప్రకారం అల్లూరి సీతారామరాజుని అలా ఉంటాడని ఎక్కడా చదవలేదు. అయినా అలా ఎందుకు చూపించాల్సి వచ్చిందన్న ప్రశ్నకి రాజమౌళి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా జనాలు అనుకుంటున్నట్టు జీవిత చరిత్ర కాదు. నిజ జీవిత పాత్రలని తీసుకుని కల్పిత కథతో తెరకెక్కించారట. ఇద్దరు వీరులు దేశంకోసం ఎలా పోరాడారో చూపించడంతో పాటు వారిద్దరి స్నేహాం ఎలా ఉంటుందో చూపించనున్నారట.
అంటే ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా చెప్పుకోవచ్చని రాజమౌళి. చెప్పాడు. ఇద్దరు స్నేహితులు అనుకోకుండా కలుసుకుని, ఏ విధంగా దేశం కోసం పోరాడారో చూపిస్తారట. ఈ సినిమాని స్నేహం అనే పాయింట్ మీదనే తెరకెక్కిస్తున్నారట.