మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సిరీస్‌లో అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారా..? ‘ఆచార్య’ తర్వాత నటించడానికి సిద్ధమయ్యారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ ప్రస్తావన రాగా..‘అవకాశం వస్తే నేను కూడా వెబ్ సీరీస్‌లో నటిస్తాను. కానీ ప్రస్తుతం అంత సమయం లేదు. నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నాను’ అని చెప్పారు.
ఆ వెబ్ సిరీస్‌ను నిర్వహించేది మరెవరో కాదండోయ్.. చిరు పెద్ద కుమార్తె సుష్మిత అని టాక్ నడుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లో అందరూ ఉండటంతో ఈ టాపిక్ వచ్చిందట. ‘డాడీ.. వెబ్ సిరీస్ సంగతేంటి’ అని సుష్మిత అడగ్గా.. ‘ఆచార్య’ తర్వాత చేద్దామని మాటిచ్చారట. ఇందులో మెగా ఫ్యామిలీ హీరోలు దాదాపు అందరూ ఉంటారట. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తునే వస్తున్నాయి.
వెబ్ సిరీస్ నిజమే అయితే ఎలా ఉంటుందో.. ఎవరెవరు నటిస్తారో అని మెగాభిమానులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం చాలా మంది వెబ్ సిరీస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో ప్రముఖ ఫ్యామిలీలు కూడా వెబ్ సిరీస్‌లోకి దిగిపోయాయి. దీంతో మెగా డాటర్ కూడా అలా అడుగేలాయని ఎప్పుడో అనుకుంది. సుష్మిత కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న విషయం విదితమే. మరి.. అది ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో..? ఇది ఎంతవర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.