>పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం సినిమాలు వదిలేసాడు. రాజకీయాల్లో సక్సెస్ అయితే గనక పవన్ మళ్లీ సినిమాలవైపు చూసేవాడు కాదు.. కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జీరో అయ్యేసరికి మళ్ళీ సినిమాలు గుర్తొచ్చాయి. రాజకీయాలతో రెండేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడమే.. వరసగా సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇక బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని వేణు శ్రీరామ్ తో మొదలెట్టేసరికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీగా ఉండడంతో.. నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని షూటింగ్ కి రప్పించడం కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసాడు.. దానికోసమే కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటూ తెగ ప్రచారం జరిగింది.
>అయితే తాజాగా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం రోజు 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని... ఇటు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోను, అటు రాజకీయాల కోసం విజయవాడకి పవన్ కళ్యాణ్ రోజు 600 కిలోమీటర్లు ప్రయాణించి కష్టపడేవారని.. ఇలా సుమారు 22 రోజులు ఆయన కష్టపడ్డారు.. కానీ ఒక్కరోజు కూడా ఆయన షూటింగ్ మిస్ కాలేదని.. ఆయనలోని ఈ నిబద్ధతకు, ఆయన అంకిత భావానికి వేణు శ్రీరామ్ ఫిదా అయ్యాడట. ఇక వకీల్ సాబ్ లోని మేజర్ సన్నివేశాల షూటింగ్ పూర్తయ్యింది అని.. కరోనా లాక్ డౌన్ పూర్తికాగానే మిగతా షూట్ కంప్లీట్ చేస్తామని వేణు శ్రీరామ్ చెప్పాడు.