Advertisementt

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది..

Wed 22nd Apr 2020 12:28 PM
allari naresh,puri jagannadh,tollywood  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది..
Tollywood hero wants to do a movie in Puris Direction పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయాలనుంది..
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా హీరోకి ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు పూరి జగన్నాథ్. మనం సరదాగా తిట్టుకునే తిట్లని కూడా సినిమా టైటిల్ లాగా పెట్టొచ్చని చూపించిన దర్శకుడు పూరి జగన్నాథ్. హీరోల్లో నెగెటివ్ షేడ్స్ ని కూడా ప్రేక్షకులు ఆదరించేట్టు చూపించే సత్తా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్. మరి అలాంటి దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించే పూరీ దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు.

టెంపర్ తర్వాత పూరికి వరుసగా ఫ్లాపులు వచ్చినా, ఇస్మార్ట్ శంకర్ తో వాటన్నింటినీ మర్చిపోయేలా చేశాడు. అప్పటి వరకు పోగొట్టుకున్నదంతా ఇస్మార్ట్ శంకర్ తో లాగేసుకున్నాడు. ఎందరో హీరోలు పూరి సినిమాలతో స్టార్ హోదా దక్కించుకున్నారు. అప్పటి వరకు హీరోలని ఒకరకంగా చూసిన ప్రేక్షకులు, పూరి సినిమాలో డిఫరెంట్ చూస్తారు. తన సినిమాలో హీరోల స్టైల్ ని పూర్తిగా మార్చేస్తాడు. తెలుగులో స్టార్ హీరోలందరితో పనిచేసిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పనిచేయాలని చాలా మంది హీరోలు చూస్తున్నారు. 

తాజాగా మరో హీరో తన కోరికని బయటపెట్టాడు. అల్లరి సినిమాతో హీరోగా పరిచయమయిన నరేష్ ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లళో యాభైకి పైగా సినిమాలు చేసిన అల్లరి నరేష్ చాలా మంది దర్శకులతో పనిచేశాడు. కానీ పూరి జగన్నాథ్ సినిమాలో నటించలేకపోయానే అని ఉందట. మహర్షి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేయడంతో, పూరి తన సినిమాలో అవకాశం ఇస్తాడేమో చూడాలి.

Tollywood hero wants to do a movie in Puris Direction:

Allari Naresh Wants to do a movie in the direction of Puri Jagannadh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ