Advertisementt

మరోసారి అనసూయ చెప్పిన ముచ్చట్లు..

Wed 22nd Apr 2020 12:10 PM
anchor anasuya,covid 19,lockdown celebrities,jabardasth  మరోసారి అనసూయ చెప్పిన ముచ్చట్లు..
Anchora Anasuya shared her life memories మరోసారి అనసూయ చెప్పిన ముచ్చట్లు..
Advertisement
Ads by CJ

బుల్లితెర యాంకర్ అనసూయ అందరికీ పరిచయమే. బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. అయితే ఆమె అంత ఫేమస్ అవ్వడానికి సినిమాలు,  టీవీలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే సొషల్ మీడియా. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేసే వారే ఆమె ఫేమస్ అవ్వడానికి కారకులవుతున్నారు. ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు తన విశేషాలని పంచుకుంటూ, ట్రోల్స్ కి ధీటుగా సమాధానమిచ్చే అనసూయ తన అభిమానులతో మరోసారి ముచ్చటించింది.

లాక్డౌన్ సమయంలో రెండోసారి ముచ్చటించిన అనసూయ ఆసక్తికరమైన విశేషాలని పంచుకుంది. తన మొదటి జీతంతో వాళ్ల అమ్మకి ఉంగరం చేయించిందట. అలాగే ఇప్పటి వరకు తాను చేసిన ఛాలెంజింగ్ రోల్ ఏదీ లేదని చెప్పింది. అంత అందంగా కనిపిస్తారు జిమ్ లో ఎంత సమయం గడుపుతారన్న ప్రశ్నకి, అస్సలు జిమ్ కే వెళ్లనంటూ సమాధానమిచ్చింది.

ఇటు బుల్లితెర మీద షోస్ తో, అటు వెండితెర మీద పాత్రలతో బిజీగా ఉన్న ఆమెని, మీ దృష్టిలో జీవితం అంటే ఏంటని అడగ్గా నాకున్న క్షణంలో నేను ఆనందంగా జీవించడమే అని సమాధానం ఇచ్చింది.

Anchora Anasuya shared her life memories:

Anchor Anasuya shared her lackdown activities

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ