Advertisementt

రాజమౌళి ఇలా షాకిచ్చాడేంటి..?

Wed 22nd Apr 2020 02:05 PM
ss rajamouli,theaters,corona,rrr movie,sensational comments  రాజమౌళి ఇలా షాకిచ్చాడేంటి..?
SS Rajamouli gives shock to audience రాజమౌళి ఇలా షాకిచ్చాడేంటి..?
Advertisement
Ads by CJ

రాజమౌళి షాకిచ్చాడంటే... RRR విడుదల మళ్ళీ వాయిదా వేసాడేమో అని అనుకునేరు. ఎందుకంటే ప్రస్తుత కరోనా లాక్ డౌన్ చూస్తే అదే అనిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ లు వాయిదా పడడంతో సినిమాల విడుదల తేదీల్లో మార్పులు రావొచ్చేమో అనే ఊహాగానాలు బయలుదేరాయి. అసలు లాక్ డౌన్ ముగిసి థియేటర్స్ తెరిచినా ఇప్పట్లో ప్రేక్షకులు థియేటర్స్ మొహం చూడరేమో అనిపిస్తుంది. అదే విషయం మొన్న నిర్మాత సురేష్ బాబు చెప్పాడు. మరో మూడు నెలలు సినిమాలకు గడ్డుకాలమే అని.

తాజాగా రాజమౌళి ప్రేక్షకులకు ఇలాంటి షాకే ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గేలా లేదని.. థియేటర్స్ నడవడానికి ఇంకొంత సమయం అంటే మరో ఆరు నెలలు పట్టినా పట్టొచ్చు అని.. కరోనా ప్రభావం తగ్గినా.. ప్రజల్లో భయం పోదని..దానికి ఆరునెలల సమయం పట్టినా పట్టొచ్చు అని చెబుతున్నాడు. మరి రెండు నెలలకే సినిమాలు లేక ప్రేక్షకులు విలవిలలాడుతుంటే.. మరో ఆరు నెలలు వెయిట్ చేయడం అంటే కష్టమే. కానీ ప్రజలను కరోనా మహమ్మారి అంతలా భయపెట్టేసింది.

SS Rajamouli gives shock to audience :

SS Rajamouli shocking Comments on Theaters Open

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ