వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌ను వదిలినా కాంట్రవర్సీలను మాత్రం అస్సలు వదలనంటోంది. అప్పుడెప్పుడో జరిగిన టాలీవుడ్‌లో జరిగిన పరిణామాలకు గాను హైదరాబాద్‌ను వదిలేసి చెన్నై చెక్కేసిన ఈ హాట్ భామ వివాదాల విషయంలో అస్సలు తగ్గట్లేదు. కోలీవుడ్‌ను కెలికేసిన ఈ భామ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై మరింత దృష్టి సారించింది. రోజుకు రెండు మూడు వివాదాలైన లేకుంటే తిన్న తిండి అరగట్లేదేమో కానీ.. అస్తమానూ సోషల్ మీడియా ఎక్కి హడావుడి చేస్తోంది. అయితే ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తూ తనను తానే ఎక్కువగా ఊహించేసుకుంటూ కలలో ప్రపంచంలో ఊరేగుతోంది.
కరోనా కాలం అయితే నాకేంటి..? నేను నా వివాదాలే అంటూ బతికేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫేస్‌బుక్ వేదికగా బండ బూతులతో కూడిన పోస్ట్‌లు చేస్తోంది. ఇందుకు నెటిజన్లు, ఆమె ఫాలోవర్స్ గట్టిగా కౌంటర్ ఇస్తుండటంతో దానికి మళ్లీ మరో పోస్ట్ పెడుతూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్య పెట్టిన కొన్ని పోస్టులకు నెటిజన్లు గట్టిగా ఇవ్వడంతో ఎలాంటి పోస్ట్ చేసిందో చూడండి. చేసింది ఓకే కానీ.. లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా ఇందులోకి లాగింది.
నయన్ ఎఫైర్స్‌పై..
‘నాకు నచ్చిన వాళ్లతో పడుకుంటా.. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం. అనవసరంగా ఏ సంబంధం లేకపోయినా ఎందుకురా..? నా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తారు. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం.. నేనెవడితో పడుకుంటే మీకెందుకు. నిజంగా అంత దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడాలి కానీ.. కన్నంలో దాక్కున్న ఎలుకల్లా చేయకండి. ఒకర్ని జడ్జ్ చేస్తున్నారంటే అది మీ ఖర్మ.. దాన్ని నేను అస్సలు పట్టించుకోను. స్టార్ హీరోయిన్‌లకు ఎఫైర్స్ లేవా..? నయనతారకు ఉన్న ఎఫైర్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు..? పెళ్లైన వాళ్లతో పాటు పెళ్లి కాని వాళ్లతో కూడా నయన్ ఎఫైర్స్ నడిపించలేదా..? ఎందుకు ఆమె గురించి మాట్లాడరు..? నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఆమెను అనేంత ధైర్యం లేదు.. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగ్లింగ్ హీరోయిన్లకు ఇదే తేడా..?’ అని కాకరేపుతూ పోస్ట్‌లు చేసింది.
రియాక్షన్ ఉంటుందా..!?
దీంతో నయన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అసలు తమరికీ.. నయన్‌కు సంబంధమేంటి.. అసలు మీ రేంజ్ ఏంటి.. ఆమె రేంజ్ ఏంటి..? కొంచెం నోరు తగ్గించి మాట్లాడితే మీకే మంచిందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటీవలే తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్‌పై చెబుతూ తీవ్ర ఆవేదనకు లోనైంది. తాజాగా శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ నయన్ ఎలా రియాక్ట్ అవుతుందో.. ఎలాంటి రిప్లయ్ ఇస్తుందో వేచి చూడాలి. వాస్తవానికి కాంట్రవర్సీకి లేడీ సూపర్ స్టార్ చాలా దూరంగా ఉంటుంది. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కూడా మిన్నకుండిపోతుందా లేదా స్పందిస్తుందో వేచి చూడాలి.