Advertisementt

బన్నీ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు..

Tue 21st Apr 2020 02:13 PM
bunny,allu arjun,sukumar,rashmika mandanna  బన్నీ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు..
Allu Arjun is busy with learning.. బన్నీ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు..
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అతడు బాగా కష్టపడుతున్నాడట. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. బన్నీకి తెలుగుతో పాటు మళయాలంలోనూ మంచి క్రేజ్ ఉంది. బన్నీ సినిమాలన్నీ అక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్తూరు జిల్లా ప్రాంత నేపథ్యంలో సాగుతుందట. అందుకోసం ఈ సినిమాలో ఎక్కువ మందిని చిత్తూరు జిల్లా నటులనే తీసుకున్నారు. అంతే కాదు పుష్ప కోసం బన్నీ చిత్తూరు జిల్లా యాసని నేర్చుకుంటున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేత గోదావరి యాస పలికించిన సుకుమార్, ఈ సినిమాలో బన్నీచేత చిత్తూరు యాసని మాట్లాడిస్తున్నాడు.

అందుకోసం బన్నీ ఈ యాసని నేర్చుకుంటున్నాడట. ఈ లాక్డౌన్ సమయంలో ఆ యాసపై పట్టు సంపాదించడానికి కృషి చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

Allu Arjun is busy with learning..:

Allu Arjun busy with learning Chittoor dialect

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ