టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ విజయంతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. టెంపర్ తర్వాత అతడు చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్న టైమ్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా అటు పూరీకి, ఇటు రామ్ కి, సంగీతం అందించిన మణిశర్మకి మంచి విజయాన్ని అందించింది. పూరీ పని అయిపోయిందన్న వాళ్లకి ఇస్మార్ట్ శంకర్ తో తానేంటో చూపించాడు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీకి విజయ్ దేవరకొండ దొరికాడు. విజయ్ హీరోగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో ఫైటర్ అనే మూవీ తెరకెక్కుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. పూరీ కూడా గతంలో రెండు బాలీవుడ్ చిత్రాలు చేసిన అనుభవం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో చేస్తున్న ఫైటర్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఫైటర్ సినిమా చేస్తుండగానే పూరీ తర్వాతి చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. బాలక్రిష్ణ- పూరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఇది నిజమైతే పూరి ఒక మంచి అవకాశం మిస్ చేసుకున్నవాడు అవుతాడని అంటున్నారు. ఫైటర్ హిట్ అయితే పూరీకి బాలీవుడ్ లో పాపులారిటీ పెరుగుతుంది. దాంతో అక్కడ కూడా అవకాశాలు వస్తాయి. మరి అన్నీ తెలిసి కూడా పూరి ఎందుకు తొందరపడుతున్నాడో..!