Advertisementt

పవన్‌తో సినిమా ప్రయత్నించా.. కానీ: రాజమౌళి

Tue 21st Apr 2020 04:33 PM
ss rajamouli,pawan kalyan,movie,power star,interview  పవన్‌తో సినిమా ప్రయత్నించా.. కానీ: రాజమౌళి
Rajamouli talks about Movie with Powerstar Pawan Kalyan పవన్‌తో సినిమా ప్రయత్నించా.. కానీ: రాజమౌళి
Advertisement
Ads by CJ

 

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యణ్ క్రేజ్ ఇప్పటికి ఎంత మాత్రమూ తగ్గలేదు. పవన్ సినిమాల్లోకి వచ్చి ఏళ్ళు గడిచినా.. పవన్ సినిమా వస్తుంది అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక టాలీవుడ్ లోనే కాదు, ఇంటర్నేషనల్ గాను రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే పిచ్చ క్రేజ్, క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి జక్కన్న - పవన్ కళ్యాణ్ కలిస్తే బాక్సాఫీసు బద్దలవడం ఖాయం. మరి రాజమౌళి RRR తర్వాత మహేష్ సినిమా అనగానే అందరిలో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. జక్కన్న - మహేష్ కాంబోపై అప్పుడే అంచనాలు. మరి అలాంటి జక్కన్నతో పవన్ కళ్యాణ్ కూడా ఓ సినిమా చేస్తే అబ్బో దాని రేంజ్ మాములుగా ఉండదు.

మరి రాజమౌళి ఎప్పుడు పవన్ తో సినిమా చెయ్యడానికి ప్రయత్నించలేదా? అంటే అలాంటిదేం లేదు.. పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా ప్రయత్నాలు జరగడం... అది క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వల్ల పట్టాలెక్కకపోవడం జరిగింది. తాజాగా రాజమౌళి అదే విషయాన్నీ రివీల్ చేసాడు. పవన్ తో సినిమా ఎందుకు చెయ్యాలనుకోలేదు.. ప్రయత్నించడం, ఆగిపోవడం రెండు జరిగాయని చెప్పిన రాజమౌళిని ఫ్యూచర్ లో పవన్ తో సినిమా ఏమన్నా ఉంటుందా అంటే.. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా బిజీ. సో సినిమాలకు సమయం కేటాయించే అవకాశాలు తక్కువ. నేనా సినిమాని ఏళ్ళ తరబడి తీస్తాను, సో నాకు పవన్ కళ్యాణ్ కి ఫ్యూచర్ లో సెట్ అవ్వొచ్చు, సెట్ కాకపోవచ్చు అంటున్నాడు. అయితే ఏదైనా నిడివి తక్కువున్న పవర్ ఫుల్ కేరెక్టర్ ఉన్న కథ తగిలితే.. పవన్ తో సినిమా ఉంటుందేమో చెప్పలేం అంటూ రాజమౌళి పవన్ సినిమాపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

Rajamouli talks about Movie with Powerstar Pawan Kalyan:

I tried movie with Pawan Kalyan says SS Rajamouli

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ