Advertisementt

రిలీజ్‌కు ముందే రీమేక్‌కు తెలుగు సినిమా..?

Tue 21st Apr 2020 09:19 AM
uppena,vijay sethupathi,vaishnav tej,kriti shetty  రిలీజ్‌కు ముందే రీమేక్‌కు తెలుగు సినిమా..?
Uppena is going to Remake in Tamil..? రిలీజ్‌కు ముందే రీమేక్‌కు తెలుగు సినిమా..?
Advertisement
Ads by CJ

తెలుగులో రీమేక్ చిత్రాల సందడి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే తెలుగు చిత్రాలు ఇతర భాషల్లోకి కూడా రీమేక్ కి వెళ్తున్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రాలని వేరే భాషల్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. మొన్నటికి మొన్న తెలుగులో బ్లాక్ బస్టర్ సాధించిన అల వైకుంఠపురములో చిత్రం తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మరో తెలుగు చిత్రం తమిళంలో రీమేక్ కి వెళ్తుందని అంటున్నారు. అయితే ఇంకా ఆ సినిమా తెలుగులో రిలీజ్ అవలేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా తమిళంలో రీమేక్ అవనుందని వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

అందువల్లే ఈ సినిమాని తమిళంలో కూడా రిలీజ్ చేయాలని భావించారు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాని తానే స్వయంగా తమిళంలో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికైతే అధికారికంగా సమాచారం రానప్పటికీ, ఆ విధంగా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన బుచ్చిబాబు తమిళ రీమేక్ డైరెక్టర్ గా చేస్తాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Uppena is going to Remake in Tamil..?:

Uppena is going to remake in tamil

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ