Advertisementt

సీఎం కేసీఆర్‌కే ఆర్జీవీ ‘వొడ్కా’ చాలెంజ్!

Tue 21st Apr 2020 09:09 AM
director rgv,ram gopal varma,vodka challenge,telangana cm kcr,cm kcr  సీఎం కేసీఆర్‌కే ఆర్జీవీ ‘వొడ్కా’ చాలెంజ్!
Director RGV vodka Challenge To telangana Cm Kcr సీఎం కేసీఆర్‌కే ఆర్జీవీ ‘వొడ్కా’ చాలెంజ్!
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు చాలెంజ్‌లు విసురుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు అధికారం వర్సెస్ ప్రతిపక్షంగా మాటల యుద్ధం నెలకొంటుండగా.. సినీ ప్రముఖులు కూడా ఇంట్లో పనులు చేస్తూ.. ఇంకా కొత్త కొత్త పనులు చేస్తూ మీరు కూడా ఇలా చేయండంటూ చాలెంజ్ విసురుతున్నారు. అయితే.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ చాలెంజ్ విసిరారు. అయితే అది సెలబ్రిటీలు కాదండోయ్.. ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కే. అది కూడా ఎలాంటి చాలెంజో మీరే ఓ లుక్కేయండి.

ఇదీ చాలెంజ్..

సీఎం కేసీఆర్‌ మీడియా మీట్‌లో అందరి ముందు కూర్చొని ఒక గ్లాస్ విస్కీ తాగమని నేను చాలెంజ్ చేస్తున్నాను. రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కడా మందు లేక చచ్చిపోతున్నారు. ఆయన అలా అందరి ముందు తాగుతుంటే అందరూ ఉడుక్కుని.. కుల్లిపోవాలి. ఇలా చేస్తే నాకిది ఓ ఎంటైర్‌టైన్మెంట్.  వైన్ లేక చాలా మంది ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్తున్నారు. అన్ని చోట్లా వైన్స్ మూసేసి ఆయన ఒక్కరే తాగుతున్నట్లున్న విజువల్ చేసి దాన్ని వెబ్ సిరీస్‌లో రిలీజ్ చేయాలి. ఆ వీడియో మీద జనాల రియాక్షన్స్ నేను చూడాలి అనుకుంటున్నాను. ఇలా చేస్తే కరోనా విషయాన్ని జనాలు మర్చిపోతారు. ఇదంతా నేను సద్బుద్ధి, సహృదయంతో చేసున్న పనిఅని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఎవరికీ భయపడా..!

కాగా.. సోషల్ లిమిటేషన్స్‌ కోసమే తాను దూరంగా ఉంటున్నానని వర్మ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన కరోనా వైరస్‌కే కాదు తాను ఎవరికీ భయపడనని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పారు. చివరగా లాక్‌డౌన్‌లో వడ్కా లేని జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారని అడగ్గా.. ఆయన మాత్రం ‘అది నేను చెప్పను.. మీరు వినకూడదు అంతే’ అని ఆర్జీవీ సమాధానమిచ్చారు. లాక్‌డౌన్‌ను కాంట్రవర్సీ చేస్తున్న వారి గురించి ఆర్జీవీని అడగ్గా.. ‘ఎవరి చావు వాళ్లు చస్తారు’ అని సింపుల్‌గా తేల్చేశారు. మొత్తానికి చూస్తే ఈ ఆర్జీవీ వెరైటీ చాలెంజ్‌కు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఆయనతో ఇలాంటి డిబెట్ పెట్టిన సదరు టీవీ చానెల్‌పై కూడా జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.

Director RGV vodka Challenge To telangana Cm Kcr:

Director RGV vodka Challenge To telangana Cm Kcr  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ