ఈ మధ్యన మహేష్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తోనే క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వచ్చిన మహేష్ కి ఎంతో స్నేహంగా వుండే వంశీ పైడిపల్లితోనూ విభేదాలు తలెత్తాయి. వంశీ పైడిపల్లి కథ వెంటేసుకుని.. మహేష్ ఫ్యామిలీ వెంట పడ్డాడు. అంతా ఓకే అనుకున్నాక మహేష్ ఆ సినిమా ఆపేసాడు. ఆ సినిమా ఎందుకు ఆగిందో అనేది ఇంకా క్లారిటీ లేక జనాలు కొట్టుకుంటున్నారు. తాజాగా పరశురామ్ తో మహేష్ మూవీ పక్కా.. కరోనా లాక్ డౌన్ ముగియగానే జూన్ లో మహేష్ - పరశురామ్ మూవీ పట్టాలెక్కుతోంది అంటున్నారు. ఇక పరశురామ్ మహేష్ కి చెప్పిన కథ ప్రకారం... ఓ భారీ స్కామ్ చేసి ఫారిన్ చెక్కేసిన బడా బిజినెస్ మ్యాన్, అతన్ని తెలివిగా తిరిగి దేశానికి తీసుకొచ్చే ఓ సాధారణ కుర్రాడి కథకి మహేష్ కనెక్ట్ అయ్యాడట.
అయితే ఈ కథపై సోషల్ మీడియాలో ప్రచారం జరగడం, అలాగే ఆ కథ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు పరశురామ్ కి ఫోన్ లోనే కథని మార్చమంటూ ఒత్తిడి చేస్తున్నట్టుగా లేటెస్ట్ ఫిలింనగర్ న్యూస్. పైన చెప్పిన కథ కాకుండా గీత గోవిందం టైప్ లోనే ఓ కుటుంబ కథ ని ప్రిపేర్ చేయమని పరశురామ్ కి మహేష్ చెప్పాడని.. దీనితో పరశురామ్ మళ్లీ అలాంటి కథ మీద కూర్చుకున్నాడనే టాక్ మొదలైంది. పరశురామ్ కి పదే పదే ఫోన్ చేస్తూ మహేష్... పరశురామ్ రాసే కథ గురించి తెలుసుకుంటున్నాడని.. పరశురామ్ కథ గనక నచ్చకపోతే మళ్ళీ మహేష్ ఏ త్రివిక్రమ్ ని తగులుకుంటాడో అనే భయంతో పరశురామ్ కాస్త టెన్షన్ పడుతున్నట్టుగా వార్తలయితే జోరుగా ప్రచారంలోకొచ్చాయి.