Advertisementt

బన్నీకి నచ్చలేదు.. విజయ్‌కి నచ్చింది

Mon 20th Apr 2020 05:19 PM
allu arjun,fighter,script,vijay deverakonda,puri jagannadh  బన్నీకి నచ్చలేదు.. విజయ్‌కి నచ్చింది
New Gossip on Puri Jagan Fighter Movie Script బన్నీకి నచ్చలేదు.. విజయ్‌కి నచ్చింది
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ హిట్ అవడంతో.. స్టార్ హీరోల చూపు పూరి మీద పడుతుందేమో అనుకున్నారు. అయితే పూరి కూడా స్టార్ హీరోలను ముఖ్యంగా మాస్ అప్పీల్ ఉన్న హీరోలను దృష్టిలో ఉంచుకునే ఓ కథని సిద్ధం చేసాడట, ఆ కథతో ముందుగా అల్లు అర్జున్ ని కలిసి తన దగ్గరున్న ఫైటర్ కథని పూరి నేరేట్ చెయ్యగా.. అల్లు అర్జున్ కి కథ నచ్చిందో.. లేదో.. తెలియదు కానీ.. పూరి జగన్నాధ్ కి అల్లు అర్జున్ నో చెప్పడంతో.. అదే కథని కాస్త అటు ఇటు మార్చి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి వినిపించగా.. అప్పటికే డియర్ కామ్రేడ్ ప్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండకి ఆ కథ నచ్చడంతో ఆ సినిమా పట్టాలెక్కింది.

అయితే విజయ్ దేవరకొండ ఆ కథని పాన్ ఇండియా లెవల్ లో ఉండాలని పూరి కి కండిషన్ పెట్టి,,.. మళ్ళీ ఫైటర్ కథని పాన్ ఇండియా లెవల్ కి మార్చడం... ఆ కథ విజయ్ కి నచ్చడంతో... అదే కథతో అటు బాలీవుడ్ లో కరణ్ జోహార్ ని మెప్పించి కరణ్ ని కూడా ఈ సినిమా లో ఇన్వాల్వ్ చేసాడు. అయితే తాజాగా ఈ ఫైటర్ కథని బన్నీ ఒప్పుకోకపోతే.. రౌడీ స్టార్ ఎలా ఒప్పుకున్నాడు. ఆ కథలో అంతగా విజయ్ దేవరకొండ కి నచ్చిందా... అంతగా నచ్చడానికి ఆ కథలో ఏముంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు షురూ అయ్యాయి.

New Gossip on Puri Jagan Fighter Movie Script:

Bunny not liked.. but Vijay likes Fighter script

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ