Advertisementt

డార్లింగ్.. వెర్రిబాగులోడిలా ఉంటాడు కానీ: జక్కన్న

Mon 20th Apr 2020 04:05 PM
ss rajamouli,interesting comments,prabhas,charan,jr ntr,sensational comments  డార్లింగ్.. వెర్రిబాగులోడిలా ఉంటాడు కానీ: జక్కన్న
SS Rajamouli Sensational Comments on Prabhas డార్లింగ్.. వెర్రిబాగులోడిలా ఉంటాడు కానీ: జక్కన్న
Advertisement
Ads by CJ

ఓటమెరుగుని దర్శకధీరుడు రాజమౌళి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. జక్కన్న ఎక్కువగా నమ్మేవారి జాబితాలో ప్రభాస్ కూడా ఉన్నాడు. ‘ఛత్రపత్రి’ మూవీతో మొదలైన వీరి జర్నీ ‘బాహుబలి’ సినిమాతో స్ట్రాంగ్ అయ్యింది. ‘బాహుబలి’ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అలా ఇద్దరి మధ్య మంచి దోస్తీ ఉంది. ఇరువురూ వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకునేంత చనువు ఉంది. అయితే.. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఆన్‌లైన్‌లో మాట్లాడిన ఆయన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.

ప్రభాస్ వెర్రిబాగులోడిలా ఉంటాడు కానీ..

ప్రభాస్‌ నాకు చాలా బాగా క్లోజ్. నేను ఆయన్ను చాలా ఇష్టపడతాను. మేమిద్దరం చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటాం. ప్రభాస్ పైకి చూడడానికి ఓ వెర్రిబోగులోడిలా కనిపించి అలా నటిస్తాడంతే. ఎప్పుడూ డార్లింగ్.. డార్లింగ్ అంటూ ఏమీ ఎరుగని వాడిగా అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ లోపల చాలా మేధావి. ఎవరికైనా మంచిగా క్లోజ్ అయితే మాత్రం అన్ని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటాడు. మనుసులను బట్టి ఎవరు ఎలాంటి వారు? వారితో ఎలా ఉండాలి? అనే విషయాలు బాగా తెలిసిన గొప్ప మానసికవేత్త.. నిజంగా చాలా మంచి మనిషి. ప్రభాస్‌కు అన్ని విషయాలపై లోతైన అవగాహనం ఉంటుంది. అతనో ఫిలాసఫర్అని డార్లింగ్ గురించి జక్కన్న చెప్పుకొచ్చారు.

చెర్రీ, ఎన్టీఆర్ గురించి మాట్లాడిన ఆయన.. వారిద్దర్నీ ఆకాశానికెత్తేస్తూ మాట్లాడాడు. వారిలో అద్భుతమైన నటనాచాతుర్యం కావాల్సినంత ఉందని ‘సింహాద్రి’, ‘మగధీర’ మూవీస్‌లో వారి నటన చూశాక అర్థమైందని రాజమౌళి తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతేకాదు.. వీరిద్దరి గురించి పైకి కనిపించే లోపాలు కూడా రాజమౌళి స్వయంగా చెప్పారు.

SS Rajamouli Sensational Comments on Prabhas:

SS Rajamouli interesting comments on Prabhas, Charan and Jr NTR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ