తెలుగు హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న వారిలో రష్మిక మందన్న ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దిరోజులకే ఆ స్టేటస్ ని దక్కించుకుంది రష్మిక. చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతుండడంతో ఆమెని లక్కీ గర్ల్ అని అంటున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ మంచి విజయాలని సాధించాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె క్యారెక్టర్ పట్ల కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ సినిమా సక్సెస్ కావడంతో అవన్నీ కనిపించకుండా పోయాయి.
అయితే హీరోయిన్ కి స్టార్ స్టేటస్ తెచ్చేది కమర్షియల్ చిత్రాలే. స్టార్ హీరోలతో చేసే కమర్షియల్ చిత్రాలే వారిని స్టార్లుగా చేస్తాయి. నటన పరంగా పర్ ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నా కూడా వారిని గ్లామర్ డాల్స్ గా చూడడం వల్లేనేమో కమర్షియల్ చిత్రాలే డబ్బునీ, పేరునీ తీసుకొస్తాయి. అందుకే ప్రతీ హీరోయిన్ తన ఫస్ట్ ఛాయిస్ గా కమర్షియల్ చిత్రాలనే ఎంచుకుంటుంది. అయితే ఎన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా.. ఒక రియలిస్టిక్ సినిమాలో నటించాలని ఎవ్వరికైనా ఉంటుంది.
అయితే రష్మిక అలాంటి మంచి అవకాశాన్ని వదులుకుంది. తెలుగులో విజయం సాధించిన జెర్సీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తుంటే, అందులో హీరోయిన్ గా నటించమని రష్మికని అడిగితే రిజెక్ట్ చేసింది. బాలీవుడ్ సినిమాలో అంత మంచి ఆఫర్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. అయితే జెర్సీ రియలిస్టిక్ చిత్రం కావడం వల్లే ఆమె ఆ అవకాశం వద్దనుకుందట. కమర్షియల్ సినిమాల్లో తప్ప రియలిస్టిక్ సినిమాల్లో ఆమె నటించదట.