బాహుబలి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ లకి రౌద్రం, రణం రుధిరం అనే వివరణ ఇచ్చాడు. అయితే సాధారణంగా తాను చేసే సినిమా విడుదల అయితే కానీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో రివీల్ చేయని రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కి దాదాపు సంవత్సరం టైమ్ ఉన్నా కూడా తన తర్వాతి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని చెప్పేశాడు.
రాజమౌళి- మహేష్ కాంబినేషన్ లో సినిమా గురించి దాదాపుగా పదేళ్ల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకదశలో మహేష్ తో రాజమౌళి సినిమా తీసే అవకాశమే లేదని తేల్చిపారేశారు. కానీ వారందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని మహేష్ తో ప్రకటించాడు. అయితే రాజమౌళితో సినిమా అనగానే మహేష్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. తన సినిమాల్లో హీరోలని చాలా స్ట్రాంగ్ గా చూపించే రాజమౌళి మహేష్ ని ఏ విధంగా చూపించనున్నాడో ఉత్సాహ పడుతున్నారు.
అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ థ్రిల్లర్ జోనర్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లాంఛింగ్ సమయంలో మహేష్ తో సినిమా తీయరా అని రాజమౌళిని అడిగినపుడు రాజమౌళి సమాధానమిస్తూ, మహేష్ తో సినిమా అంటే జేమ్స్ బాండ్ లాంటి సినిమా తీయాలని అన్నాడు. దాన్ని బట్టి రాజమౌళి మహేష్ కాంబోలో తెరకెక్కే సినిమా జేమ్స్ బాండ్ లాంటి యాక్షన్ తో కూడుకున్న థ్రిల్లర్ మూవీ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.