నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా శ్రియా సరన్ వ్యవహరిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి అడ్రస్ లేకుండా పోయింది ఈ సీనియర్ భామ. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధమని చెప్పుకుంటూ ఉంటుంది. అయితే పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసి స్పెయిన్‌లో నిలిచిపోయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. అటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అవకాశాలు అస్సలే రావట్లేదు. అయితే తనను అభిమానులు ఎక్కడ మరిచిపోతారో అని వారి కోసం అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటోస్.. ఇంకా వల్గర్ టాక్స్‌తో వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల.. తన భర్తకు కరోనా లక్షణాలున్నాయని శ్రియ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. వాస్తవానికి స్పెయిన్‌లో కరోనా మరణాలు చాలా ఎక్కువే. కరోనా లక్షణాలుంటే కచ్చితంగా 14 నుంచి 20 రోజుల వరకూ క్వారంటైన్‌లో ఉండాల్సిందే లేకుంటే పరిస్థితులు అనుకూలించవ్. అయితే.. శ్రియ, ఆండ్రీ ఇద్దరూ ఆస్పత్రికెళ్లి టెస్ట్ చేయించుకున్నాక.. ఇంటికొచ్చేయడం అప్పట్నుంచి సోషల్ మీడియా వేదికగా వాళ్ల సరసాలడటం.. మూతులు నాక్కోవడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆండ్రీ బర్త్ డే నాడు ఎవరో ఒక నెటిజన్ ఏదో పిచ్చి పిచ్చిగా వాగటం.. అది మళ్లీ చదివి మరీ భర్తకు వినిపించడం.. ఆ నెటిజన్‌కు ఆండ్రీ మద్దతిస్తూ సూపర్బ్ అని చెప్పి.. ఇంకా కామెంట్ చేయండి అని చెప్పడంతో సభ్య సమాజానికి వీళ్లిద్దరూ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు.
ఎంతో మంది నటీనటులను నెటిజన్లు తిట్టి పోస్తుంటారు.. బూతుల వర్షం కురిపిస్తుంటారు. దాన్ని ప్రత్యేకించి మరీ హైలైట్ చేసి మాట్లాడటం ఎంతవరకు సబబో శ్రియకే తెలియాలి. అవతలి వ్యక్తి అంటే సిగ్గూ శరం వగైరా లేకుండా మాట్లాడాడు అనుకుంటే.. తమరిలా దిగజారి మరీ దిగజారి వ్యవహరించాలా..? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. పోనీ ఇలాంటి చేష్టలతో తమరికేమైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే అదీ లేదు.. మహా అంటే వార్తల్లో నిలుస్తారే తప్ప అస్సలు కుదరని పని. అందుకే మన లిమిట్స్‌లో మనముంటే.. ఎదుటి వ్యక్తి కూడా అదేలా గౌరవమిచ్చి మాట్లాడతాడనే విషయం శ్రియా తెలుసుకుంటే మంచిదని క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.