Advertisementt

మహేశ్‌ సరసన ‘సాహో’ భామ ఫిక్స్!

Sun 19th Apr 2020 03:38 PM
bollywood beauty,shradda kapoor,saho actress,romance,mahesh babu,mahesh-parasuram movie  మహేశ్‌ సరసన ‘సాహో’ భామ ఫిక్స్!
Bollywood Beauty Romance With Mahesh Babu Next Movie! మహేశ్‌ సరసన ‘సాహో’ భామ ఫిక్స్!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేశ్ బాబు 27వ సినిమాను ‘గీత గోవిందం’ దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి దెబ్బతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఈ గ్యాప్‌లో కథకు ఇంకా మెరుగులు దిద్దడం, హీరోయిన్, పాత్రధారులను వెతుక్కునే పనిలో పడ్డాడు పరుశురామ్. ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ వద్దు.. బాలీవుడ్ భామలే ముద్దు అనే ఫార్ములానా మన దర్శకనిర్మాతలు గట్టిగానే ఫాలో అవుతున్నారు. అందుకే మహేశ్ సరసన రొమాన్స్ కోసం బాలీవుడ్ భామను పట్టుకురావాలని పరుశురామ్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ భామ ఎవరో కాదండోయ్.. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన శ్రద్ధా కపూర్.

నిన్న మొన్నటి వరకూ సారా అలీఖాన్ మొదలుకుని అలియా భట్.. పూజా హెగ్దే, కీర్తి సురేశ్ ఇలా చాలా మంది పేర్లే వినిపించాయ్. కానీ ఫైనల్‌గా సాహో భామనే పరుశురామ్ ఫిక్స్ చేశాడట. మాంచి లవ్ స్టోరీ కావడంతో శ్రద్ధా అయితేనే సెట్ అవుతుందని అనుకుంటున్నారట. త్వరలోనే ఆ బ్యూటీని సంప్రదించి ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నాడట. కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే మే-30 నుంచి షూటింగ్ షురూ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి దేవీ శ్రీ, థమన్ కాకుండా గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడ‌ని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సమ్మర్ కల్లా ప్రేక్షకుల ముందు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోందట.

Bollywood Beauty Romance With Mahesh Babu Next Movie!:

Bollywood Beauty Romance With Mahesh Babu Next Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ