అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగులో నాటి నుంచి నేటి వరకూ టాప్‌లో ఉన్న లేడీ యాంకర్‌కు భర్త నుంచి దూరమయ్యిందట. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. భర్త చిత్ర విచిత్రాలుగా ప్రవర్తిస్తుండటంతో ఇక సైడవ్వడమే బెటరని భావించిన ఆ యాంకరమ్మ విడాకులు తీసుకుందట. ఆ విడాకులు కూడా తీసుకుంది ఈ మధ్య కాదట. సుమారు ఏడాదికిపైనే అయ్యిందట. ఈ విషయం ఇన్ని రోజులూ అటు ఇండస్ట్రీలో గానీ.. ఇటు మీడియాకు కానీ లీకవ్వకుండా మేనేజే చేశారట. ఇంతకీ ఆ టాప్ యాంకర్ ఎవరు..? ఎందుకు విడాకులు తీసుకుందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఒకప్పుడు అక్కడ.. ఇప్పుడు ఇక్కడ!
బాలీవుడ్ కల్చర్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో.. ఎప్పుడు వదిలేసి ఇంకొకర్ని చూసుకుంటారో..? ఎవరితో డేటింగ్ చేస్తారో..? చివరికి ఎవర్ని పెళ్లి చేసుకుంటారో.. ఎప్పుడు విడాకులిచ్చేస్తారో..? ఎవరికీ అర్థం కాదు.. కాబోదు కూడా. అప్పటికీ ఇప్పటికీ ఇదే పరిస్థితి. అయితే.. టాలీవుడ్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.. కానీ ఇది ఒకప్పుడు చెప్పుకునే మాట. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయ్. కాస్త అటు ఇటు బాలీవుడ్ పరిస్థితే టాలీవుడ్‌లోనూ నెలకొంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన జంటలు సైతం చివరికి ఎన్నెన్నో కారణాలతో విడిపోతున్నారు. ఇందుకు ప్రత్యేకించి ఉదాహరణలు చెప్పనక్కర్లేదు.
అసలేం జరిగింది!?
ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యాంకర్.. నాటికీ నేటీకీ ఆ యాంకరమ్మను ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. అలాంటి ఆమె ఏరి కోరి మరీ ప్రేమించి పెద్దలను ఎదరించి మరీ పెళ్లి చేసుకుంది. ఇటు అబ్బాయి తరఫున వాళ్లు మాత్రం బాగా ఉన్నోళ్లో.. అటు యాంకరమ్మ సైతం అప్పటికే కోట్లు సంపాదించేసింది. ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవ్. అంటే పెళ్లికి ముందే రెండు ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ అంతే. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టినంత వరకూ వీరి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. నిజంగా ఈ జంటను చూసిన జనాలు ఆదర్శంగా కూడా తీసుకునేవారు. అలా జీవితం సాగిపోతున్న తరుణంలో అసలేం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఉన్నట్టుండి బాంబ్ లాంటి వార్త బయటికి వచ్చింది.
మూడో కంటికి తెలియకుండా..!
అదేమిటంటే.. భర్త పద్ధతులు నచ్చక భార్యే దూరం కావాలనుకుని విడాకులు తీసుకుందట. ఏడాది క్రితమే ఈ తంతు జరిగినప్పటికీ ఇటు యాంకరమ్మ అటు భర్తకు అవకాశాలు చేజారిపోతాయేమోనని భావించి మూడో కంటికి కూడా తెలియకుండా విడాకులు తీసేసుకున్నారట. ఈ వార్త విన్న అభిమానులు షాకయ్యారట. వారిద్దరూ విడిపోయి ఏడాది పూర్తయినప్పటికీ ఇంతవరకూ బహిరంగంగా కానీ.. మీడియా ముఖంగా కానీ.. ఇంటర్వ్యూల ద్వారా కానీ.. ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా గౌరవప్రదంగానే విడిపోవడం ఒకింత మంచి పరిణామమే అయినప్పటికీ కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ వీర్త బయటికి పొక్కింది. ఎందుకు విడిపోయారు..? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..? అనే కారణాలు మాత్రం వారిద్దరిలో ఎవరూ ఒకరు నోరు విప్పితే కానీ తెలిసేలా లేవు. మరి క్లారిటీ ఎప్పుడు వస్తుందో ఏంటో..!