తెలుగులో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతీ హీరో పాన్ ఇండియా సినిమాలని ట్రై చేస్తున్నాడు. నిర్మాత అల్లు అరవింద్ కూడా పాన్ ఇండియా ప్లాన్ చేస్తున్నాడు. ఇతిహాసగాథ రామాయణాన్ని అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఈ సినిమాని దంగల్ దర్శకుడు నితీష్ తివారీతో పాటు మామ్ ఫేమ్ రవి ఉద్యవార్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరిగింది.
ప్రభాస్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తారని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వచ్చి చాలా రోజులవుతున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సినిమా ఇంకా ఆగిపోలేదని.. ప్రాసెస్ లో ఉందని అల్లు అరవింద్ చెబుతున్నాడు. ౩డీలో తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నాడట.
అందుకని ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యాక.. ఆ సినిమా ఎలా వర్కౌట్ అవుతుందన్న దాన్ని బట్టి రామాయణాన్ని ఏవిధంగా తెరపైకి తీసుకురావాలో ఆలొచిస్తారట. ఎంత్గ బడ్జెట్ లో తెరకెక్కించాలి, ఎంత బిజినెస్ చేయగలదు అన్న అంశాలని చూసుకున్న తర్వాతే రామాయణం తెరమీదకి రానుందని అంటున్నాడు. అంటే ఆర్ ఆర్ ఆర్ నేషనల్ వైడ్ గా చూపించే ప్రభావాన్ని బట్టే రామాయణాన్ని ప్లాన్ చేస్తారన్నమాట.