రాజమౌళి కాంబోలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR సినిమా అనౌన్స్ చేసినప్పటినుండే RRR అనే టైటిల్ వాడుకలోకి రావడం.. అదే టైటిల్ విపరీతముగా సర్క్యులేట్ అయ్యింది. RRR అంటే రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇంతే. తాజాగా రాజమౌళి RRR టైటిల్ అంటూ రౌద్రం రణం రుధిరం అంటూ వదిలారు. అయితే RRR కొచ్చినంత రెస్పాన్స్.. రౌద్రం రణం రుధిరం టైటిల్ కి రాలేదు. అసలు రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఎవ్వరు పెద్దగా పలకడం లేదు అంటే జనాలకు ఆ టైటిల్ అంతగా రుచించలేదు.
తాజాగా రాజమౌళి కూడా అదే విషయం ఒప్పుకున్నాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉండాలి. మార్కెట్ కి కనెక్ట్ కావాలి అంటే... అదే కరెక్ట్. కాకపోతే RRR అనే పదానికి ఓ అర్ధం ఉండాలిగా.. లేదంటే అందరూ రాజమౌళి - రామారావు - రామ్ చరణే అనుకుంటారు కాబట్టి... RRR కి ఓ అర్ధం ఉండాలనే ప్లాన్ తోనే..రౌద్రం రుధిరం రణం పెట్టామని.. లేదంటే RRR టైటిల్ కి అంతగా ప్రాధాన్యత లేదు. మేము కూడా RRR అనే పిలుస్తున్నాం కానీ... రౌద్రం - రణం - రుధిరం అంటూ అసలు పిలవమని చెబుతున్నాడు. అంటే ఫైనల్ గా RRR అంటే RRR అన్నమాట.