ఎన్టీఆర్ నట విశ్వరూపం అంటే ఏ దర్శకుడికైనా, అభిమానికైనా పిచ్చ ఇంట్రెస్ట్. ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పాడంటే థియేటర్స్‌లో విజిల్స్. ఇక సెట్స్ లోను ఎన్టీఆర్ సింగల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ అందరూ కితాబునిచ్చినట్టే... టాలీవుడ్‌లో ఓ కుర్ర హీరో కూడా ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెబుతున్నాడు. ఇంతకీ ఎవరు అతను అనుకుంటున్నారా? హిట్ తో హిట్ కొట్టిన కుర్ర హీరో విశ్వక్ సేన్. ఏ సీన్ అయినా ఎన్టీఆర్ సింగల్ టేక్ లో చెయ్యడం ఎన్టీఆర్ ప్రత్యేకత. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్. నేను తెలుగులో ఎక్కువగా ఇష్టపడే హీరో ఎన్టీఆర్ అంటున్నాడు.
ఇక మహేష్ అంటే హ్యాండ్సమ్ హీరో అని, అల్లు అర్జున్ స్టైలిష్ హీరో అని చెబుతున్న విశ్వక్ సేన్ కి మల్టీస్టారర్ అవకాశం వస్తే.. మాత్రం తన ఫేవరెట్ నిర్మాత, హీరో నాని తో చెయ్యాలని ఉందని చెబుతున్నాడు. ఇక దర్శకుల్లో తనకిష్టమైన దర్శకుడు తరుణ్ భాస్కర్ అని చెబుతున్నాడు. తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ఎప్పటికి తన ఫేవరెట్ అని చెబుతున్నాడు విశ్వక్.