Advertisementt

పవన్, మహేష్‌తో సినిమా అంటున్న కుర్ర డైరెక్టర్

Sat 18th Apr 2020 09:12 PM
rahul ravindran,dream project,pawan kalyan,mahesh babu,young director  పవన్, మహేష్‌తో సినిమా అంటున్న కుర్ర డైరెక్టర్
Young Director wants Movie with Pawan Kalyan and Mahesh Babu పవన్, మహేష్‌తో సినిమా అంటున్న కుర్ర డైరెక్టర్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోలను మల్టీస్టారర్ మూవీస్ లో చూడాలనే కోరిక చాలామంది ఫ్యాన్స్ కి ఉంది. ఇప్పటికే మహేష్ - వెంకటేష్ లు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేస్తే.. వెంకటేష్ - పవన్ కళ్యాణ్ లు కలిసి ‘గోపాలా గోపాలా’ సినిమా చేసారు. తాజాగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు బడా హీరోలు కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నారు. అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ఇద్దరు మాత్రమే కాదు..... ఇండియా వైడ్ గా అందరిలో ఆసక్తి ఉంది. ఇక ఎప్పటినుండి పవన్ కళ్యాణ్ - మహేష్ కాంబోలో బడా మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరగడమే కానీ... ఆ కాంబో ఎప్పటికి పట్టాలెక్కుతుందో ఎవరూ చెప్పలేరు.

అయితే తాజాగా ఓ కుర్ర దర్శకుడు మహేష్ - పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ తన కల అంటున్నాడు. అతనే రాహుల్ రవీంద్రన్... చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన ఈ నటుడు రెండో సినిమాని కింగ్ నాగార్జున తో చేసాడు. మన్మథుడు 2 సినిమాని నాగ్ తో తెరకెక్కించి డిజాస్టర్ అందుకున్న రాహుల్ ప్రస్తుతం ఓ చిన్న సినిమాని ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నారు. అయితే రాహుల్ రవీంద్రన్ రెండు సినిమాలు స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకున్నాడని... అందులో ఒకటి తమిళ బిగ్ స్టార్‌తో ప్లాన్ చేస్తున్నానని.. ఇంకోటి చి ల సౌ తరహాలో చిన్న ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు రాహుల్. ఇక పవన్ - మహేష్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చేయాలని అది తన డ్రీం ప్రాజెక్ట్ అంటున్నాడు రాహుల్. మహేష్ - పవన్ కాంబో అంటే.. కథ పవర్ ఫుల్ గా ఉండాలని, వీళ్ళని కలిపి సినిమా చెయ్యడం అనేది సామాన్యమైన విషయం కానప్పటికీ.. వాళ్లతో సినిమా చెయ్యాలనేది తన కోరిక అంటున్నాడు.

Young Director wants Movie with Pawan Kalyan and Mahesh Babu:

This is the Rahul Ravindran Dream Project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ