Advertisementt

‘పుష్ప’: సుక్కు-సేతుప‌తి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌?

Sat 18th Apr 2020 08:49 PM
pushpa,latest update,vijay sethupathi,sukumar,creative differences  ‘పుష్ప’: సుక్కు-సేతుప‌తి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌?
Creative Differences between Sukumar and Vijay Sethupathi ‘పుష్ప’: సుక్కు-సేతుప‌తి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ మూవీని సుకుమార్ రూపొందిస్తున్నాడు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే ఈ క‌థ‌లో ట్ర‌క్ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ క‌నిపించ‌నున్నాడు. కాగా ఈ సినిమాలో త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు. సినిమాలో బ‌న్నీ, సేతుప‌తి మ‌ధ్య నువ్వా, నేనా అనే రేంజిలో డైలాగ్స్‌, చేజింగ్ సీన్స్ ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి సుకుమార్‌తో సేతుప‌తి అసంతృప్తి వ్య‌క్తం చేశాడంటూ కోలీవుడ్‌లో ప్ర‌చారం న‌డుస్తోంది. కార‌ణం.. త‌మిళంలో నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌డం సేతుప‌తికి ఇష్టం లేక‌పోవ‌డ‌మే అనేది ఆ ప్ర‌చారానికి మూలం.

ర‌జ‌నీకాంత్ మూవీ ‘పేట‌’లోనూ, విజ‌య్ లేటెస్ట్ మూవీ ‘మాస్ట‌ర్‌’లోనూ నెగ‌టివ్ రోల్స్ చేసిన‌ప్ప‌టికీ, ‘పుష్ప’ త‌మిళ వెర్ష‌న్‌లో నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌డానికి ఎందుక‌నో సేతుప‌తి ఇష్ట‌ప‌డ‌టం లేదంటున్నారు. నిజానికి ‘పుష్ప‌’ను పాన్ ఇండియా ఫిల్మ్‌గా తియ్యాల‌ని నిర్మాత‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్ అనుకోలేదు. కానీ బ‌న్నీ మునుప‌టి సినిమా ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సాంగ్స్ దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొంద‌డంతో ‘పుష్ప’ను పాన్ ఇండియ‌న్ మూవీగా నిర్మించాల‌ని టీమ్ నిర్ణ‌యించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో మిగ‌తా భాష‌ల్లో విల‌న్‌గా క‌నిపించ‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌ని సేతుప‌తి త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో సేతుప‌తిని క‌న్విన్స్ చేయ‌డానికి సుకుమార్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. ఇది కేవ‌లం ఎవ‌రో పుట్టించిన వ‌దంతి మాత్ర‌మేనా, లేక ఇందులో నిజ‌ముందా?.. అనే విష‌యం త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్న‌ది.

Creative Differences between Sukumar and Vijay Sethupathi :

Pushpa Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ