అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందా అన్న అనుమానాలకి తెరపడింది. ఈ విషయమై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. లాక్డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వచ్చిన రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు మహేష్ బాబుతో ఉంటుందని కన్ఫర్మ్ చేసేశాడు. బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పనులు కొనసాగుతుండగానే మహేష్ తో తన తర్వాతి చిత్రం ఉంటుందని చెప్పేశాడు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుందని తెలియగానే మహేష్ అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలా అని తికమకపడుతున్న మహేష్ కి పరశురామ్ తో చేసిన తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
అయితే ఈ చిత్రమే మహేష్ బాబు కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వచ్చే సంవత్సరం ఉన్నందున, మహేష్ తో చేయబోయే మూవీ 2022లో వచ్చే అవకాశం ఉంది.