Advertisementt

బన్నీ పుష్పలో లవ్ ట్రాక్ లేనట్టే..?

Fri 17th Apr 2020 04:55 PM
allu arjun,sukumar,rashmika mandanna,devisri prasad  బన్నీ పుష్పలో లవ్ ట్రాక్ లేనట్టే..?
There is no love track in Bunny Pushpa..? బన్నీ పుష్పలో లవ్ ట్రాక్ లేనట్టే..?
Advertisement
Ads by CJ

దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ ఇండస్ట్రీ హిట్ ని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బద్దలు కొట్టాడు. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రమే పుష్ప. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రివేంజ్ డ్రామాగా రూపొందుతుంది.

పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన వచ్చింది. మాస్ లుక్ లో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. అల్లు అర్జున్ మాస్ గా కనిపిస్తున్నాడంటే హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక లుక్ కూడా అలాగే ఉంటుందని అర్థమైపోయింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మధ్య రంగస్థలం మాదిరి లవ్ ట్రాక్ ఉంటుందేమో అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య ఎలాంటి లవ్ ట్రాక్ ఉండదట.

సినిమా మొదటి నుండి వీరిద్దరు భార్యాభర్తలుగానే కనిపిస్తారట. అంతేకాదు చిత్తూరు ప్రాంత యాసలో వీరిద్దరి మాట్లాడుకునే మాటలు చాలా బాగుంటాయట. భార్యభర్తలుగా వీరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండనుందని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రేమికుల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన సుకుమార్, మొదటిసారిగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమని చూపించబోతున్నాడని అంటున్నారు.

There is no love track in Bunny Pushpa..?:

No seperate love track in Bunny Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ