Advertisementt

మహేష్ కోసం కథ రాస్తున్న స్టార్ డైరెక్టర్..?

Fri 17th Apr 2020 04:35 PM
mahesh babu,harish shankar,pawan kalyan  మహేష్ కోసం కథ రాస్తున్న స్టార్ డైరెక్టర్..?
Star director writing script for Mahesh..? మహేష్ కోసం కథ రాస్తున్న స్టార్ డైరెక్టర్..?
Advertisement
Ads by CJ

సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. వంశీ పైడిపల్లితో క్యాన్సిల్ కావడంతో పరశురామ్ తో ఉంటుందని వార్తలు వచ్చినా ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. లాక్డౌన్ తర్వాత ఈ విషయమై క్లారిటీ వస్తుందని తెలిసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ మహేష్ కోసం కథ రాస్తున్నాడట.

గద్దలకొండ గణేష్ సినిమాతో విజయం సొంతం చేసుకున్న హరీష్ శంకర్ మహేష్ కోసం కథ రాస్తున్నాడని టాక్. స్వతాహాగా రచయిత అయిన హరీష్, గద్దలకొండ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటన కూడా వచ్చింది. లాక్డౌన్ కారణంగా ఇంటిదగ్గరే ఉండి, పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడు. అయితే దాంతో పాటు మరో రెండు మూడు కథల్నిసిద్ధం చేస్తున్నాడట. అందులో ఒక కథని ప్రత్యేకించి మహేష్ కోసమే రెడీ చేస్తున్నాడని టాక్.

గబ్బర్ సింగ్ సినిమాతో ఒక స్టార్ హీరోకి కథ ఎలా రాయాలో చూపించిన హరీష్ తో సినిమా చేసేందుకు ఎవ్వరైనా రెడీగా ఉంటారు. మరి మహేష్ కోసం స్క్రిప్టు రెడీ చేస్తున్న హరీష్ శంకర్ కి ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుందా లేదా చూడాలి.

Star director writing script for Mahesh..?:

harish Shankar writing script for Mahesh babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ