Advertisementt

నా 50కి నువ్వే.. నీ 25లో నేనే....

Fri 17th Apr 2020 12:18 PM
nani,mohanakrishna indraganti,sudheer babu,avasaala srinivas,v the movie  నా 50కి నువ్వే.. నీ 25లో నేనే....
My fiftieth would be with you.. నా 50కి నువ్వే.. నీ 25లో నేనే....
Advertisement
Ads by CJ

అష్టాచమ్మా సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని వెండితెరకి పరిచయం అయ్యాడు. మోహనకిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మరో హీరోగా అవసరాల శ్రీనివాస్ కనిపించాడు. అవసరాల శ్రీనివాస్ కి కూడా ఇదే మొదటి చిత్రం. అష్టాచమ్మా లో రాంబాబుగా చేసిన నానికి మంచి విజయాన్ని అందించింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. అష్టాచమ్మా, జెంటిల్ మేన్ చిత్రాలు నానికి మంచి పేరుని తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రమే వి. మోహనక్రిష్ణ తన జోనర్ ని వదిలి థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్న మొదటి చిత్రం కాగా, నాని మొదటిసారిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే నేడు దర్శకుడు మోహనక్రిష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని నాని విషెస్ తెలిపాడు.

అయితే తనని హీరోగా పరిచయం చేసిన మోహనక్రిష్ణకి బర్త్ డే కానుకగా కమిట్ మెంట్ కూడా ఇచ్చేశాడు. నాని హీరోగా చేయబోయే 50వ చిత్రానికి మోహనక్రిష్ణే దర్శకత్వం వహించాలని కోరుతున్నాడు. అలాగే మోహనక్రిష్ణ చేయబోయే 25వ చిత్రంలో తాను హీరోగా నటిస్తాడట. పుట్టినరోజునాడు ఎవరైనా వందేళ్ళు జీవించాలని కోరుకుంటారు. అయితే సినీ దర్శకుడైన ఇంద్రగంటి కెరీర్ పొడుగ్గా సాగాలన్న ఉద్దేశ్యంతోనే నాని ఆ విధంగా కోరుకున్నాడని అంటున్నారు.

My fiftieth would be with you..:

You would be my fiftieth director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ