Advertisementt

బన్నీ పుష్ప: విజయ్ స్థానంలో కన్నడ హీరో..?

Fri 17th Apr 2020 11:56 AM
bunny,allu arjun,sukumar,ala vaikunthapurramulo,vijay sethupathi,dhananjaya  బన్నీ పుష్ప: విజయ్ స్థానంలో కన్నడ హీరో..?
Kannada hero to replace in Pushpa..? బన్నీ పుష్ప: విజయ్ స్థానంలో కన్నడ హీరో..?
Advertisement
Ads by CJ

అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్నఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి తమిళ నటుడు విజయ్ సేతుపతి తప్పుకుంటున్నాడట.

విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని తెలిపారు. అయితే ప్రస్తుతం విజయ్ తప్పుకోవడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో తమిళ నటుడినే తీసుకుందామని సుకుమార్ భావించాడట. కానీ ఏమైందో ఏమో ఇప్పుడు కన్నడ నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమచారం. 

రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన భైరవ గీత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయిన ధనంజయని విజయ్ సేతుపతి స్థానంలో తీసుకోవాలని చూస్తున్నాడట. ఫారెస్ట్ ఆఫీసరుగా కన్నడ హీరో ధనంజయ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అని, అధికారిక సమాచారం రావడమే ఆలస్యం అని అంటున్నారు.

Kannada hero to replace in Pushpa..?:

kannada hero to replace i Bunny Pushpa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ