Advertisementt

రష్మికపై ఆ డౌట్స్ పెట్టుకోవద్దంటున్నారు

Thu 16th Apr 2020 05:40 PM
pushpa,rashmika mandanna,pan india image,pushpa movie,doubts  రష్మికపై ఆ డౌట్స్ పెట్టుకోవద్దంటున్నారు
News About Rashmika Role in Pushpa Movie రష్మికపై ఆ డౌట్స్ పెట్టుకోవద్దంటున్నారు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. సుకుమర్ పుష్ప కథ పాన్ ఇండియా లెవలే. అలాగే అల్లు అర్జున్ స్టయిల్ క్రేజ్ అన్ని పాన్ ఇండియా కి సరిపోయే లెవల్స్. కానీ హీరోయిన్ విషయంలో అల్లు అర్జున్ - సుక్కు తప్పు చేశారేమో.. కన్నడ, తెలుగు లో మాత్రం క్రేజ్ ఉన్న రష్మిక మందన్నని ఎంపిక చేసుకుని సుక్కు తప్పు చేసాడేమో.. రష్మిక క్రేజ్ పాన్ ఇండియా లెవల్ కాదని అనుకుంటున్నారు. మరి నిజంగానే ఏ పూజా హెగ్డే నో, లేదంటే కియారా అద్వానినో, లేదంటే జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకోకుండా చిన్న హీరోయిన్స్ రష్మిక అంటే... అందరిలో అనుమానాలు పీక్స్ లోకెళ్ళాయి.

అయితే తాజాగా అల్లు అర్జున్ మాస్ లుక్‌కి భారీ లెవల్లో ఇండియా వైడ్ గా ఎంతగా క్రేజ్ వచ్చిందో.. రష్మిక పాత్ర కి కూడా అంతే పేరొస్తుంది అని అంటున్నారు. అల్లు అర్జున్ పక్కా మాస్ గా, చిత్తూరు యాసలో లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. ఇక రష్మిక పాత్ర సినిమాకి ఎంతో కీలకం అని... అల్లు అర్జున్ పాత్రకి పూర్తి భిన్నంగా ఉంటుంది అని... పుష్ప సినిమాలో ఒక గిరిజన యువతిగా రష్మిక పాత్ర ఎంటరవుతుందని చెబుతున్నారు. కథ రసవత్తరంగా పాకాన పడుతుండగా రష్మిక పాత్రలో ట్విస్ట్ ఆడియన్స్ కి షాక్ ఇస్తుందని అంటున్నారు. ఇప్పటివరకు రష్మిక చేసిన పాత్రలు ఒక ఎత్తు.. ఇప్పుడు రష్మిక పుష్ప సినిమాలో చెయ్యబోయే పాత్ర మరో ఎత్తు అంటున్నారు. 

News About Rashmika Role in Pushpa Movie:

Rashmika gets Pan India Image with Pushpa role 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ