సినిమాల్లో మెగాస్టార్‌గా వెలిగిన చిరంజీవి... రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. రాజకీయాల్లో జీరోగా మిగిలిన చిరు మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చిరు మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. చిరు క్రేజ్ తగ్గలేదు కాబట్టే వరసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న చిరుకి పాలిటిక్స్ మీద ఆశ చావలేదనిపిస్తుంది. ఎందుకంటే చిరు ప్రత్యక్షంగా రాజీకీయాల గురించి ఆలోచించడం లేదు కానీ.. సినిమాల్లో పాలిటిక్స్ మీద సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ సినిమాలో చిరంజీవి నక్సలైట్ గాను, పురాతన దేవాలయ సంపదను కాపాడడానికి పోరాడే ప్రొఫెసర్ కనిపిస్తాడని ప్రచారం ఉంది. అయితే తాజాగా చిరు - కొరటాల సినిమా బ్యాగ్డ్రాప్ ఏమిటో రివీల్ చేసేసారు. అలాగే చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని చిరు ఎప్పుడో చెప్పేసాడు. ఇక చరణ్ రోల్ కి హీరోయిన్ కూడా ఉంటుంది అని కొరటాల కన్ఫర్మ్ చేసాడు.
ఇక చిరు - కొరటాల మూవీ బ్యాగ్డ్రాప్ పొలిటికల్ థ్రిల్లర్ అని.... ప్రకృతి వనరులను కాపాడే ఓ వ్యక్తిగా చిరంజీవి పాత్ర ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు కొరటాల శివ. మరి ఈ సినిమాలో చిరు లుక్ లీకైనదాన్ని బట్టి.. చిరు నక్సలైట్ గా మాస్‌గా కనబడతాడని, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అన్యాయాన్ని ఎదురించే ప్రొఫెసర్ గా చిరు కనబడతాడనే ప్రచారానికి కొరటాల ఫుల్ స్టాప్ పెట్టి.. మా సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక కొరటాల గత సినిమాల వలే.... సోషల్ మెసేజ్ అందిస్తూనే ఫ్యాన్స్‌కి కావాలసిన కమర్షియల్ అంశాలు ఈ ఆచార్యలో ఉండబోతున్నాయట. మరి కరోనా లాక్‌డౌన్‌తో ఆచార్య ముచ్చట్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అందులో రామ్ చరణ్ రోల్ కి ఓ హీరోయిన్ ఉంటుంది అనేదాని మీద తాజాగా మరో ముచ్చట తెర మీదకి వచ్చింది.