Advertisementt

స్టార్స్‌కి కండీషన్లు పెడుతున్న ఓటిటీ ప్లాట్‌ఫామ్స్

Thu 16th Apr 2020 05:11 PM
ott platforms,conditions,telugu stars,producers,corona effect  స్టార్స్‌కి కండీషన్లు పెడుతున్న ఓటిటీ ప్లాట్‌ఫామ్స్
OTT Platforms Conditions For Telugu Stars స్టార్స్‌కి కండీషన్లు పెడుతున్న ఓటిటీ ప్లాట్‌ఫామ్స్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనాతో లాక్ డౌన్ నడుస్తున్న కారణంగా విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదా పడ్డాయి. 25 రోజుల నుండి మరో 20 రోజుల పాటు సినిమాలన్నీ వాయిదా వేసుకోవాల్సిందే. థియేటర్స్ మొత్తం కరోనా కారణంగా మూతపడ్డాయి. ఇక కరోనా లాక్ డౌన్ ముగిసి సినిమా థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ.... ప్రేక్షకులు థియేటర్స్ బాట పట్టడం కష్టం. అందుకే ఈ కరోనా కాలాన్ని క్యాష్ చేసుకుంటున్న ఓటిటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాతలు, హీరోల ముందు భారీ ప్రపోజల్స్ తో సినిమా కొనేసి ఓటిటీ ద్వారా సినిమా విడుదల చెయ్యాలనే ప్లాన్ చేస్తుంటే.. భారీ ధరలు చూసి నిర్మాతలు పడిపోతున్నప్పటికీ.... హీరోలు మాత్రం ఈ విషయంలో ఒప్పుకోవడం లేదు.

అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొత్త క్రేజ్ ఉన్న సినిమాలకు భారీ డీల్ సెట్ చేసి నిర్మాతలను టెంప్ట్ చేస్తున్నారు. అయితే భారీగా డీల్ ఇవ్వడమే కాదు.. కొన్ని కండిషన్స్ కూడా పెడుతున్నారట. ఆ కండిషన్స్ లో భాగంగా హీరో, హీరోయిన్స్ అలాగే దర్శకులు మిగతా టెక్నీకల్ డిపార్ట్మెంట్ వారు కూడా పబ్లిసిటీ కార్యక్రమాలు చేపట్టాలని... అంటే ఫేస్ బుక్ లో లైవ్ చాట్స్, అలాగే ఫేస్ బుక్ లోను, ఇతర ఛానల్స్ లోను ఇంటర్వూస్ ఇస్తూ తమ సినిమా ఎప్పుడు అమెజాన్ లో ప్రసారం అవుతుందో చెప్పాలని, ఇక సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచాలని, అలాగే సినిమా యాడ్స్ విషయంలోనూ ఛానల్స్ లోను, పత్రికల్లోనూ సినిమా విడుదల డేట్ వేసి ప్రచారం చేసే బాధ్యత నిర్మాతలదే అని అమెజాన్ కండిషన్స్ పెడుతుందట. మరి నిర్మాతలు అమెజాన్ కండిషన్స్ కి ఓకే కానీ.. హీరోలు మాత్రం మా వాళ్ళ కాదు.. థియేటర్స్ లో ఎంత లేట్ అయినా పర్లేదు.. విడుదల చెయ్యండి ప్రచారం చేస్తాం.. కానీ ఓటిటీ లో మాత్రం మేం పబ్లిసిటీ చెయ్యమని చెబుతుంటే.. నిర్మాతలు అటు అమెజాన్ కి ఇటు హీరోల మధ్యలో నలిగిపోతున్నారట.

OTT Platforms Conditions For Telugu Stars:

Stars Okay, OTTs Scaring With Demands

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ