‘అర్జున్ రెడ్డి’ సినిమా యూత్‌ను ఏ రేంజ్‌లో అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో అర్జున్ రెడ్డి సినిమా భాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సింగిల్ సినిమాతో అటు హీరో విజయ్ దేవరకొండ.. ఇటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇద్దరి పేర్లు టాలీవుడ్‌లో మార్మోగింది. ఈ ఇరువురి రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాను తర్వాత బాలీవుడ్‌లోనూ ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగు హీరోలతో సినిమా చేయడానికి అస్సలు అవ్వలేదు. అసలు చేస్తాడో లేదో కూడా తెలియదు. కానీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం వెలుగుచూసింది.
అదేమిటంటే.. ప్రాజెక్ట్ రెడీగా ఉన్నప్పటికీ సరైన హీరో మాత్రం దొరకట్లేదట. అందుకోసం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వెతికినప్పటికీ ఒకరిద్దరు సెట్ అవ్వడం ఆ తర్వాత సారీ అని చెప్పి సైడైపోవడం జరుగుతోందట. మొదట ఈ కథను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఒప్పుకుని హ్యాండివ్వడంతో ఆ స్థానంలో ఎవర్ని తీసుకుందామా..? అని ఆలోచించి టాలీవుడ్‌కు వచ్చేశాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్లు కూడా తెరపైకి వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
అయితే.. వారిద్దరూ కూడా కుదరదని చెప్పడంతో తాజాగా.. ఈ ప్రాజెక్టుతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీని సంప్రదించినట్లు తెలుస్తోంది. స్టోరీ లైన్ చెప్పగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉందని చెప్పిన బన్నీ.. ఓకేనా లేదా నాట్ ఓకేనా అనేది మాత్రం చెప్పలేదట. కాస్త టైమ్ ఇవ్వండి సార్.. చెబుతాను అని సందీప్‌కు చెప్పాడట. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో..’ మూవీ తర్వాత బన్నీ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేసి నంబర్ వన్ కావాలని బన్నీ తెగ తాపత్రయపడుతున్నాడు. ఇలాంటి తరుణంలో సందీప్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.